రాష్ట్రాభివృద్ధి కార్యక్రమాలపైన సీఎం జగన్ ఫోకస్

రాష్ట్రాభివృద్ధి కార్యక్రమాలపైన సీఎం జగన్ ఫోకస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతానికి రాష్ట్ర రాజధాని అంశంపై ఎక్కువగా ద్రుష్టి సారించారని అర్థమవుతుంది. అయితే ఈ విషయమై కొందరు సీఎం జగన్ కి మద్దతు పలుకుతుంటే, మరికొందరు మాత్రం సీఎం జగన్ ని చాలా దారుణంగా విమర్శిస్తున్నారు. రాజధాని అంశంతో పాటే మరికొన్ని రాష్ట్రాభివృద్ధి కార్యక్రమాలపైనా సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. ఈమేరకు కడప జిల్లాలోని ప్రజలకు గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి ఉక్కు పరిశ్రమకు పునాది రాయి వేయడానికని సీఎం జగన్ నేడు కడప జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. అక్కడే మరికొద్ది సేపట్లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన చేయనున్నారు.

ఇకపోతే పులివెందుల, జమ్మలమడుగు, మైదుకూరు, కడప, రాయచోటి లాంటి ప్రాంతాల్లో మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. కాగా జమ్ములమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌కు శంకుస్థాపన చేసిన తరువాత, దువ్వూరు మండలం నేలటూరు దగ్గర మైదుకూరు, బద్వేలు ప్రాంతంలో కొన్ని అభివృద్ది పనులకు శంకుస్ధాపన చేయనున్నారు. తరువాత రిమ్స్‌లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, వైఎస్ఆర్ ఉచిత భోజన వసతి భవనం, రైల్వే ఓవర్ బ్రిడ్జి లను ప్రారంభించనున్నారు సీఎం జగన్…