ఏపీలో కరోనా వైరస్ ప్రభావంతో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల సంఘం కమీషనర్ రమేష్ కుమార్ చంద్రబాబు నాయుడు కులానికి చెందినవాడు కావడంతోనే ఎన్నికలను వాయిదా వేశాడని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించాలన్నా, వాయిదా వేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని భావించాలని, అయితే, కేంద్ర వైద్య ఆరోగ్య శాఖతో తాను సంప్రదించానని, వారి సూచనల మేరకే కరోనా వైరస్ వల్ల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు రమేష్ కుమార్ ప్రకటించారు.
అయితే ఈ నేపధ్యంలో తాజాగా సీఎం జగన్ ఇంటెలిజెన్స్ అధికారుల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేస్తున్నారనేంత పెద్ద కీలకమైన నిర్ణయాన్ని కూడా పసిగట్టలేకపోతే ఇక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎందుకని, ఇంటెలిజెన్స్ అధికారులపై జగన్ అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.