వైసీపీ అధినేత మరియు ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వై ఎస్ జగన్ పరిపాలనపై ఎన్ని విమర్శలు కానీ అడ్డంకులు వచ్చినా సరే తాను చెప్పిన మాట ప్రకారం కొన్నిటిపై అడ్డంగా నిలబడిపోయారని చెప్పాలి.తాను గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ముఖ్యంగా నవరత్నాల విషయంలో మాత్రం చాలా కట్టుబడి ఉన్నారు.
అలా అసలు ఏ రాష్ట్ర నాయకుడు చెప్పని విధంగా తన రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పలు పథకాలు నేరుగా ఇంటికే అందించే సదుపాయం కల్పిస్తామని చెప్పారు.ప్రస్తుతం ఆ పనులను వాలంటీర్లు చేస్తున్నారు కూడా.ఇదిలా ఉండగా వీరితోనే మరో కీలక ఘట్టం కూడా నెరవేర్చే పనిని కూడా చేయిస్తానని జగన్ చెప్పారు.అదే ఇంటి వద్దకే వచ్చి అర్హులకు ఫించను పంపిణీ చెయ్యడం.ఇది మాత్రం నిజంగా హర్షించదగ్గ నిర్ణయం అని చెప్పాలి.
గంటలు గంటలు లైన్లో ఉండలేని వృద్దులు అలాగే కొంతమంది వికలాంగులకు జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పాలి.అలా జగన్ తీసుకున్న ఈ సంచలనాత్మక నిర్ణయం ఈరోజు(ఫిబ్రవరి 1) నుంచే అమలు కానుంది.రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 54.65 లక్షల మంది అర్హులకు 1320 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనుంది అని తెలుస్తుంది.ఏది ఏమైనప్పటికీ మాత్రం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం చాలా మందికి ఒక భరోసా లాంటిది అని చెప్పాలి.ఇక మీదట నుంచి ఎవరూ ఒకటో తారీఖున గంటల పాటు లైన్లో వేచి ఉండక్కర్లేదు.