జగన్ ఆడుతున్న మూడు ముక్కలాట

జగన్ ఆడుతున్న మూడు ముక్కలాట

వైసీపీ అధినేత మరియు ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న రాజధాని మార్పు నిర్ణయం సర్వత్రా కలకలం రేపుతోంది.అయితే మొదట రాజధాని తరలింపుకు చిన్నగా సిగ్నల్స్ ఇస్తూనే ఫైనల్ డెసిషన్ తేల్చి చెప్పేసి ఇంకా మార్పు లేదని అంటున్నారు.ఇలా జగన్ ఆ కమిటీ ఈ కమిటీ అని చెప్తూ తన అండర్ లోనే ఇచ్చిన ఫైల్ ను మళ్ళీ వారే ఇచ్చినట్టుగా తనకు కావాల్సిన అన్ని సౌకర్యాలు చక్కబెట్టుకుంటున్నారని ఇతర పార్టీల వారు అనేక విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇదిలా ఉండగా సామాన్యులు మాత్రం జగన్ ఆడుతున్న మూడు ముక్కలాటను అదిరిపోయే పాయింట్స్ తో చెప్పి మరీ రాజధాని అమరావతిని ఎందుకు తరలిస్తున్నారని ప్రశ్నిస్తుండగా వారికి అండగా టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ నిలబడ్డారు.”ఉన్న ఆదాయాన్ని కాపాడలేని జగన్ గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యడానికి మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాట మొదలు పెట్టారు.అమరావతిలో జరిగిన అభివృద్ధి గురించి సామాన్యుడికి తెలిసిన విషయాలు జగన్ గారు వేసిన కమిటీలకు తెలియకపోవడం దారుణం.” అంటూ పార్ట్ 1 పార్ట్ 2 అని రెండు వీడియోస్ పెట్టి జగన్ కు దిమ్మతిరిగేలా షాకిచ్చారు.