జగన్ మోహన్ రెడ్డి కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయం

జగన్ మోహన్ రెడ్డి కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయం

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయం తీసుకున్నారు. శాసన మండలి రద్దుకు ఆమోదం పొందారు. అయితే మరి కొద్దీ సేపట్లో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశంలో ఈ శాసన మండలి రద్దు కు సంబంధించిన బిల్లు ని ప్రవేశ పెట్టి ఆమోదించే అవకాశం వుంది. ఆ తర్వాత కేంద్రానికి పంపడం, ఈ బిల్లు అంశం ఫై ఆమోదించమని కోరడం. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణం గురువారం ప్రవేశ పెట్టిన అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లు లను శాసన మండలి సెలెక్ట్ కమిటీకి పంపడమే.

అయితే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడానికి నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. జగన్ ప్రలోభాలకు టీడీపీ ఎమ్మెల్సీ లు లొంగని కారణంగా మండలిని జగన్ రద్దు చేయాలనీ భావించారు అంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ అసెంబ్లీ సమావేశానికి టీడీపీ దూరం ఉండనుంది అని నిన్న జరిగిన టీడీఎల్పీ సమావేశంలో తెలిపింది. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఫై అసెంబ్లీ లో ఎలా స్పందిస్తారనేది ఉత్కంఠ రేపుతోంది.