మహిళల కోసం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన దిశ చట్టం

మహిళల కోసం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన దిశ చట్టం

గత నెలలో తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ శివార్లలో జరిగినటువంటి వెటర్నరీ డాక్టర్ దిశ హత్యోదంతం కారణంగా, మరెక్కడా అలాంటి అమానవీయ ఘటనలు మరెక్కడా జరగకుండా ఇతర రాష్ట్రాల్లో కొత్త చట్టాలు తీసుకొస్తున్నారు. కాగా ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళలకు అండగా ఉండేందుకు దిశ చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఈమేరకు గురువారం నాడు అమరావతిలోని తన క్యాంపు కార్యాలయంలో పలు అంశాలతో పాటు దిశ చట్టం అమలుకై తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు, సీఎం జగన్ పలు ఆదేశాలు జారీ చేశారు.

అంతేకాకుండా ఇలాంటి ఘటనల విషయంలో న్యాయపరంగా, పోలీసు శాఖ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ, అవసరమైన ఏర్పాట్లను చేయాలనే అంశంపై పలు సూచనలు చేశారు. కాగా ఈ దిశ చట్టం రాష్ట్రంలో కట్టుదిట్టముగా జరగాలని, ఎక్కడైనా ఈ చట్టానికి వ్యతిరేకంగా విమర్శలు రాకూడదని ఆదేశించారు. అంతేకాకుండ ఈ చట్టం అమలుకు అవసరమైన కోర్టుల ఏర్పాటుకు అవసరమయ్యే బడ్జెట్, ఫోరెన్సిక్ ల్యాబులు వాటికీ అవసరమైన అన్ని సదుపాయాలను తక్షణమే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా మహిళా పొలిసు స్టేషన్లను కూడా పూర్తి స్థాయి సదుపాయాలతో ఏర్పాటు చేయాలనీ సూచించారు. ఈ సమీక్ష సమావేశానికి రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరాం, డీజీపీ గౌతమ్ సవాంగ్ తదితరులు హాజరయ్యారు.