రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకున్నప్పటినుండి కూడా రాష్ట్ర ప్రజలందరికి లబ్ది చేకూరేలాగా ఎన్నో మంచి మంచి పథకాలను ప్రవేశపెట్టిన సీఎం జగన్మోహన్ రెడ్డి, తాజాగా మరికొన్ని పథకాలను కూడా ప్రవేశపెట్టారు… అయితే కొత్తగా ప్రవేశ పెట్టిన పథకాలపై నేడు సీఎం జగన్మోహన్ రెడీ పలు సమీక్షలు నివహించనున్నారని సమాచారం. కాగా ప్రస్తుతానికి మున్సిపల్ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, నేడు మధ్యాహ్నం 3 గంటలకు అమ్మఒడి పథకం, విద్యాశాఖపై కీలకమైన సమీక్ష సమావేశం నిర్వహించనున్నారని తాజా సమాచారం.
అంతేకాకుండా ఈ నెల 9న ఎంతో ప్రతిష్టాత్మకమైన అమ్మఒడి పథకాన్ని సీఎం జగన్ చిత్తూరు జిల్లాలో ఘనంగా ప్రారంభించనున్నారు. కాగా ఇప్పటికే అనేక శాఖల నుండి రూ.6,109 కోట్లకు పైగా నిధులు విడుదల చేయడం జరిగింది. ఈ అమ్మఒడి పథకం మేరకు పిల్లలను చదివించే తల్లి బ్యాంక్ ఖాతాలో అక్షరాలా అటు వేల రూపాయలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జమ చేయనుంది. అయితే ఎలాంటి అవకతవకలు ఏర్పడకుండా ఆ డబ్బు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుంది.