జగన్ బలహీనత అలాగే ఉందా..?

jagan-not-spending-any-amount-from-his-account

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

డబ్బుంటే ఎవరైనా ఎలాగైనా మారిపోతారంటారు. మొన్నటి ఉపఎన్నికల్లో కూడా టీడీపీ, వైసీపీ బాగానే ఖర్చుపెట్టాయి. నంద్యాల, కాకినాడ ప్రాంతాల్లో డబ్బు వరదలై పారింది. రెండు చోట్లా ఓటర్లు జీవితంలో ఎప్పుడూ చూడని నిధుల్ని అక్కడ చూశారు. కానీ ఇద్దరూ డబ్బులు ఖర్చుపెట్టినా ఒక్కరే గెలిచారు. దీంతో ధన ప్రవాహంతోనే టీడీపీ గెలిచిందని జగన్ ప్రచారం చేస్తున్నారు. కానీ అసలు విషయం వేరే ఉందంటున్నారు వైసీపీ నేతలు.

ఏ ఎన్నికల్లో అయినా డబ్బు లేందే ఎవరూ గెలవరని అందరికీ తెలుసు. అయినా సరే వైసీపీ నేతలు మాత్రం అలాంటి ఆరోపణలు చేస్తున్నారు. వారికీ లోపల జగన్ పై అసంతృప్తి ఉన్నా.. పైకి మాత్రం ఏమీ లేనట్లు ఉన్నారు. గత ఎన్నికల్లో జగన్ ఓటమికి ప్రధాన కారణం రుణమాఫీ. కానీ మరో కీలకమైన అంశం ఏమిటంటే జగన్ ఎన్నికల ప్రచారానికి పార్టీ నుంచి ఫండ్ ఇవ్వలేదు.

టీడీపీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా అభ్యర్థులకు ఎంతో కొంత పార్టీ ఫండ్ ఇస్తుంది. ప్రతి పార్టీ ఇస్తుంది. కానీ దాంతోనే పనులు జరిగిపోవు. దీనికి తోడు అభ్యర్థులు సొంతంగా నిధులు ఖర్చుపెట్టుకుంటారు. వైసీపీ నేతలు కూడా నిధులు ఖర్చుపెట్టారు. కానీ పార్టీ నుంచి ఫండ్ రాలేదు. దీంతో వైసీపీ అభ్యర్థులు ఇప్పుడు మథనపడుతున్నారు. లక్షకోట్లు సంపాదించుకుని కూడా పార్టీ కోసం ఖర్చు చేయకపోతే.. ఇంకేం చేస్తారని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు.

మరిన్ని వార్తలు:

మోడీకి లాభమే.. దేశానికే నష్టం

ఎలుకలే వరదలకు కారణమా..?

బ్లాక్ మనీపై కొత్త అడుగు