మోడీకి లాభమే.. దేశానికే నష్టం

shiv-sena-party-sensational-comments-on-modi

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

కొన్ని కొన్ని విషయాల్లో కరడుగట్టిన హిందుత్వ వాదంతో మాట్లాడే శివసేన.. మరికొన్ని విషయాల్లో మాత్రం ప్రజాప్రయోజనాలను చక్కగా అర్థం చేసుకుంటుంది. డీమానిటజైషన్ ను మొదట్నుంచీ తప్పుబడుతున్న ఆ పార్టీ.. ఇప్పుడు ఆర్బీఐ నివేదిక తర్వాత మరింత రెచ్చిపోయింది.పైగా 99 శాతం డబ్బు మార్కెట్ నుంచి బ్యాంకులకు వచ్చిందంటే. అదంతా వైట్ మనీ ఏగా అన్న మరో వాదన తెరపైకి తెచ్చింది.

బీజేపీ ఎన్నికల స్టంట్ గా పెద్ద నోట్లు రద్దు చేసిందని, అసలు బ్లాక్ మనీ ఉన్నవాళ్లెవరికీ ఈ చర్య వల్ల నష్టం కలగలేదని, అంత నష్టం జరిగి ఉంటే.. కొంతమంది ఇళ్లలో భారీగా పెద్దనోట్లు ఎలా దర్శనమిచ్చాయని తన అధికార పత్రిక సామ్నాలో ఆర్టికల్ రాసింది శివసేన. బ్యాంకులకు చేరని ఓ శాతం డబ్బు కూడా నల్లధనం అయ్యుండదని, సామాన్యులే బ్యాంకుల ముందు క్యూలో నిల్చునే ఓపిక లేక వదిలేసి ఉంటారని ముక్తాయించింది. మొత్తం మీద మోడీ తీసుకున్న తెలివి తక్కువ నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని, జీడీపీ కూడా బాగా పడిపోయిందని గుర్తుచేసింది శివసేన. నకిలీ నోట్ల మీద పూరించిన సమర శంఖంగా నోట్ల రద్దును అభివర్ణించిన బీజేపీ నేతలు ఇప్పుడేమంటారని ఎదురు ప్రశ్నించింది శివసేన. ఇప్పటికైనా బీజేపీ నేల విడిచి సాము చేయడం మానేసి దేశ ప్రజల అవసరాల్ని గుర్తించి ప్రవర్తించాలని దెప్పిపొడిచింది.

మరిన్ని వార్తలు:

బ్లాక్ మనీపై కొత్త అడుగు

కొత్త నోట్లు హైదరాబాద్ రావా..?