రాజదాని విషయంలో సీఎం జగన్ కీలకమైన వాఖ్యలు

రాజదాని విషయంలో సీఎం జగన్ కీలకమైన వాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ జరిగిన ఆఖరి రోజు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజదాని విషయంలో కొన్ని కీలకమైన వాఖ్యలు చేశారు. కాగా సీఎం జగన్ చేసిన ఆ వాఖ్యలు ఇప్పుడు తీవ్రమైన దుమారాన్ని రేపుతున్నాయి. అయితే సీఎం జగన్ చేసిన వాఖ్యలపై పెనుమాక రైతులు తీవ్రమైన నిరసనను వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజధాని విషయంలో వైసీపీ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని, మీ కుట్రపూరితమైన రాజకీయాలకోసం మా రైతుల జీవితాలతో ఆడుకోవద్దని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే మీరు తీసుకున్న రాజధానుల నిర్మాణాల వలన రాష్ట్ర ప్రజలందరుకూడా తీవ్రమైన ఇబ్బందులకు గురవుతారని వెల్లడించారు.

ఇకపోతే అమరావతి నుండి రాష్ట్ర రాజధానిని తరలించాలని ప్రయత్నిస్తే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, లేకపోతె తమ వద్ద నుండి తీసుకున్న భూములని తమకే తిరిగి ఇచ్చేయాలని రైతులు డిమాండ్ చేశారు. అయితే ఇదే విషయంలో గుంటూరు జిల్లా మందడంలోనూ రైతులు నిరసన చేస్తున్నారు. ఒకటే రాజధానిని నిర్మించాలని, లేకపోతె ప్రభుత్వం నిర్ణయించినట్లుగా మూడు రాజధానులు నిర్మిస్తే, ప్రజాధనం పెద్దఎత్తున వృధా అవుతుందని, అందువల్ల మళ్ళీ ఆ భారం తమపై పడుతుందని రైతులు ఆవేదన అవ్యక్తం చేశారు.