ఏపీ ప్రజల దేవుడిగా మారిన సీఎం జగన్మోహన్ రెడ్డి

ఏపీ ప్రజల దేవుడిగా మారిన సీఎం జగన్మోహన్ రెడ్డి

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సంక్షేమ పథకాల లబ్ధిదారులందరికీ కొత్త కార్డులను మంజూరు చేస్తున్నట్లు ప్రకటన చేశారు. నిన్న సీఎం జగన్ సచివాలయం నుండి 13 జిల్లాల కలెక్టర్లు మరియు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక నవంబర్ నెల 20వ తేదీ నుండి డిసెంబర్ నెల 20వ తేదీ వరకు ఉంటుందని గ్రామ, వార్డ్ సచివాలయ సిబ్బంది మరియు గ్రామ, వార్డ్ వాలంటీర్లు ఈ బాధ్యతలు నిర్వహిస్తారని సీఎం జగన్ చెప్పారు.

సీఎం జగన్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ, పెన్షన్, రేషన్ మొదలైన సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక కొరకు సర్వే చేస్తున్నట్లు తెలిపారు. కొత్త కార్డులను ప్రభుత్వ పథకాలకు జారీ చేయటం వలన ఏ పథకానికి ఏ కార్డు ఉపయోగపడుతుందో లబ్ధిదారులకు తెలుస్తుందని సీఎం జగన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. నెలరోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేపడుతున్నట్లు సీఎం జగన్ తెలిపారు.

అధికారులకు కూడా లబ్ధిదారులకు కొత్త కార్డులను జారీ చేయటం ద్వారా లబ్ధిదారుల గురించి స్పష్టత వస్తుందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. నాయీ బ్రాహ్మణులకు నగదు, అమ్మఒడి, వైయస్సార్ నేతన్న నేస్తం, సున్నా వడ్డీ మొదలైన పథకాలకు అతి త్వరలో మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్టు సీఎం జగన్ ప్రకటించారు. శాశ్వతంగా లబ్ధిదారుల పేర్లు వెల్లడించేలా గ్రామ సచివాలయాల్లో బోర్డులు ఉండాలని సీఎం జగన్ వెల్లడించారు.

కలెక్టర్లు, ఎస్పీలు ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే ఉన్నామని గుర్తు పెట్టుకోవాలని ప్రజా వినతుల పరిష్కారానికి కలెక్టర్లు, ఎస్పీలు చొరవ చూపాలని సీఎం జగన్ సూచించారు. ప్రభుత్వ మానస పుత్రికగా ఉగాది పండుగ నాటికి ఇళ్ల స్థలాలను ఇచ్చే కార్యక్రమాన్ని సీఎం జగన్ అభివర్ణించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కలెక్టర్లు కృషి చేయాలని సీఎం జగన్ కోరారు. జిల్లా కలెక్టర్లు, రెవిన్యూ అధికారులు అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తించాలని సీఎం జగన్ కోరారు.