ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19 కరోనా కారణంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతో సీఎం వైఎస్ జగన్ షాక్ కి గురౌతున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా పలాస ఘటనపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘శ్రీకాకుళం జిల్లా పలాసలో కోవిడ్ మృతదేహాన్ని జేసీబీతో తరలించిన ఘటన దిగ్భ్రాంతికి గురి చేసింది. మానవత్వాన్ని చూపాల్సిన సమయంలో కొంత మంది వ్యవహరించిన తీరు బాధించింది. ఇలాంటి ఘటనలు మరెక్కడా పునరావృతం కాకూడదు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకతప్పదు’ అని ట్విట్టర్ వేదికగా సీఎం వైఎస్ జగన్ హెచ్చరించారు.