ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచిపోయింది. అయితే ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన రోజున ఆరు నెలలలోనే మంచి సీఎంగా పేరు తెచ్చుకుంటానని చెప్పాడు. అయితే అందుకు తగ్గట్టుగానే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ పాలనతో అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూడా ఒకదాని తరువాత ఒకటి నెరవేరుస్తూ పాలనను కొనసాగిస్తున్నాడు.
అయితే తాజాగా సీఎం జగన్ మరో కీలక శాఖ బాధ్యతలను తనపై వేసుకున్నాడు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డ్(SIPB) చైర్మన్‌గా జగన్ వ్యవహరించనున్నారు. అయితే ఈ మేరకు SIPB పునర్నిర్మాణం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే ఈ బోర్డ్ సభ్యులుగా మంత్రులు రాజేంద్రనాథ్ రెడ్డి, సుభాశ్ చంద్రబోస్, రామచంద్రా రెడ్డి, సత్యనారాయణ, కురసాల కన్నబాబు, జయరాం, గౌతం రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఇకపోతే ఈ బోర్డ్‌కు కన్వీనర్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ కొనసాగనున్నారు.