లండన్ పర్యటన ముగించుకుని జగన్ ఏపీకి వచ్చారు. ఇంకా ఇప్పటివరకు జగన్ రాజకీయం ఒక ఎత్తు..ఇప్పటి నుంచి ఒక ఎత్తు అని చెప్పుకువచ్చాడు . లండన్ నుంచి రాగానే జగన్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆ తర్వాత నుంచి ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి. జగన్ పూర్తిగా ప్రజల్లోనే ఉండనున్నారు. అయితే ఇక్కడ నుంచే రాజకీయంగా అడుగులు జాగ్రత్తగా వేయాలి. చంద్రబాబు అరెస్ట్ అయ్యి జైలుకెళ్లారు. అలా అని టిడిపిని తక్కువ అంచనా వేయకూడదు.
అదే సమయంలో ప్రజల్లోకి వెళ్లినప్పుడు కేవలం బాబునే టార్గెట్ చేసి విమర్శలు చేయడం వల్ల..టిడిపికి అడ్వాంటేజ్ అవుతుంది. అలా కాకుండా బాబు తప్పు చేసి జైలుకు వెళ్లారని చెబుతూనే..మరో వైపు తాము చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. వైసీపీ నేతలంతా ప్రజల్లోనే ఉండాలి. అలా బాబు అరెస్ట్ అయ్యారు…ఇంకా జగన్ మొత్తం చూసుకుంటారు. మనం ఏం చేయకపోయిన గెలిచేస్తామని అనుకుంటే పోరపాటే. దీని వల్ల వైసీపీకి దెబ్బ.
ఎంతసేపు బాబు అరెస్ట్ పై ప్రెస్ మీట్లు పెట్టడం, తిట్టడం చేయడం వల్ల..అనవసరంగా బాబుపై సానుభూతి పెంచినట్లు అవుతుంది. అలా కాకుండా బాబు చేసిన తప్పులని ఎత్తిచూపాలి. ఇటు తాము చేసిన సంక్షేమాన్ని వివరించాలి. అలా అంతా ప్రజల్లో తిరగాలి. అప్పుడే వైసీపీకి పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. లేదంటే వైసీపీకే నష్టం.
అయితే ఇక నుంచి జగన్ రాజకీయం ఎలా ఉంటుందనేది చూడాలి . ఆయన వర్షన్ ఎలా ఉంటుంది..ఎలాంటి విమర్శలు చేస్తారనేది చూడాలి. ఒకవేళ బాబు బెయిల్ పై బయటకొచ్చాక ఆయన్ని ఏ విధంగా టార్గెట్ చేసి రాజకీయంగా పై చేయి సాధిస్తారో మనం చూడాలి.