డబ్బు కోసం అలాంటి సినిమాలు చేశా…తప్పలేదు !

Jagapathi Babu First Look From Yatra Movie

టాలీవుడ్ లో ఇప్పుడు జగపతిబాబు కెరీర్ బాగానే నడుస్తోంది. హీరోగా చేసిన సమయంలో అనేక ఎత్తుపల్లాలు చవిచూసిన ఆయనకి ఇప్పుడు విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మంచి డిమాండ్ ఉంది. తాజాగా, ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో తన జీవితంలో అత్యంత హీనదశ గురించి వివరించారు. 2008-09 నుంచి 2012 వరకు చీకటిరోజులుగా పేర్కొన్నారు. ఆ సమయంలో డబ్బు కోసం పరమచెత్త సినిమాలు కూడా చేశానని చెప్పాడు. నిర్మాతలు ఎంతిస్తే అంత తీసుకుని నటించానని గుర్తు చేసుకున్నారు. ఒకరకంగా మనసు చంపుకుని ఆ విధంగా చేయాల్సి వచ్చిందని జగపతి ఆవేదన వ్యక్తం చేశారు. కానీ అప్పటి పరిస్థితుల దృష్ట్యా ఆవిధంగా చేయకతప్పలేదని అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో అలాంటి దుర్దశ ఉంటుందని చెప్పుకొచ్చాడు.