యాత్ర జగ్గు బాయ్ లుక్ రిలీజ్.. లుక్ ఎలా ఉందంటే…!

Jagapathi Babu First Look From Yatra Movie

మహి వి రాఘవ దర్శకత్వంలో మలయాళ మెగా స్టార్ మమ్ముటి హీరోగా నటించిన చిత్రం యాత్ర. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేకర్ రెడ్డి గారి జీవిత ఆధారంగా రూపొందింది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. అలాగే చిత్రా ప్రమోషన్ కార్యక్రమాలతో చాలా బిజీగా ఉన్నది. ఈ చిత్రం నుండి ఇటివల విడుదలైన టిజర్ అండ్ ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్సు వచ్చింది. ఈ సినిమా పై రెండు రాష్ట్ర ప్రజలు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్ర టిజర్ కూడా సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. ఈ బయోపిక్ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవలిసిన వ్యక్తి రాజారెడ్డి. ఇతను రాజశేకర్ రెడ్డి తండ్రి. ఈ పాత్రను ప్రముఖ నటుడు జగపతి బాబు నటించాడు.

తెలంగాణా నేపద్యంలో వచ్చిన జై బోలో తెలంగాణా చిత్రంలో ఉద్యకారుడుగా నటించిన జగపతి బాబు కు తెలంగాణా ప్రజలనుండి మంచి మార్క్స్ పడ్డాయి. ఇప్పుడు రాజారెడ్డి పాత్రలో నటించిన జగపతి బాబును రాయలసీమ ప్రజలు ఎన్నటికి మరిచిపోరు. యాత్ర బయోపిక్ నుండి తాజాగా జగపతి బాబు లుక్ ను విడుదల చేశారు. ఆ లుక్ కు తెలుగు ప్రజలనుండి మంచి రెస్పాన్సు వస్తుంది. ఈ చిత్రాని 70ఎమ్ఎమ్ బ్యానర్ పైన విజయ్ చిల్ల, శశిదేవి రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాని ఫిబ్రవరి 8 న తెలుగు, తమిళ, మలయాళ బాషలో విడుదలచేస్తున్నారు. అదే రోజు ముందునాడు ఎన్టీఆర్ మహానాయకుడు విడుదలవుతుంది. ఇవి రెండు కూడా బయోపిక్ మూవీలె కావున రెండింటి మద్య పోటి ఉండే అవకాశం లేకపోలేదు.