రాజకీయ నాయకులు ఎక్కువగా ఎలాంటి దుస్తులు వేసుకుంటారు? తెల్లటి ఖద్దరు బట్టలు. అలా అని తెల్ల బట్టలు వేసుకున్న అందరూ రాజకీయ నాయకులైపోరు! ముఖ్యంగా తననీ గెటప్‌లో చూసి పొలిటీషియన్ అని పొరబాటు పడకండి అంటున్నాడు ప్రముఖ నటుడు జగపతిబాబు. భవిష్యత్తులో కూడా రాజకీయాల్లోకి వచ్చే ఛాన్సే లేదని చెప్తున్నాడు. ఈ మేరకు ఆయన తాజాగా ట్విటర్‌లో ఓ ఫొటో షేర్ చేశాడు.
ఇందులో తెల్ల కుర్తా, పైజామా ధరించిన జగ్గూ భాయ్ చేతిలో నల్ల కళ్లద్దాలు పట్టుకుని గోడపై కూర్చొని సీరియస్‌గా ఫొటోకు పోజిచ్చారు. త్వరలో ఏమైనా పాలిటిక్స్‌లోకి అడుగు పెడుతున్నారా? అని అభిమానులు సందేహం వ్యక్తం చేయగా రాజకీయ నాయకుడిగా మాత్రం ఉండాలనుకోవడం లేదు అని క్యాప్షన్‌తోనే క్లారిటీ ఇచ్చాడు. దీంతో మంచి నిర్ణయం తీసుకున్నారని మెచ్చుకున్న నెటిజన్లు సినిమాల్లో మాత్రం లీడర్ పాత్ర చేయండి అని సూచిస్తున్నారు.