ఆనందయ్యకి మద్దతుగా నటుడు

ఆనందయ్యకి మద్దతుగా నటుడు

కరోనాతో అల్లాడిపోతున్న జనాల్లో కొత్త ఆశలను రేకెత్తించింది ఆనందయ్య మందు. డబ్బులను మంచినీళ్లలా ఖర్చు చేసినా కట్టడి కాని వైరస్‌ కేవలం ఆయుర్వే మందు వల్ల నియంత్రణలోకి వస్తుండంతో అందరి దృష్టి ఆనందయ్య మందు మీద పడింది. పైగా దీనివల్ల ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్‌లు లేకపోవడం, ఉచితంగా ఇస్తుండటంతో కరోనా బాధితులు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం వైపు అడుగులు వేస్తున్నారు.

తాజాగా దీనిపై తెలుగు దిగ్గజ నటుడు జగపతిబాబు స్పందించాడు. మానవాళిని కాపాడేందుకు ప్రకృతి ముందుకు వచ్చిందని అభిప్రాయపడ్డాడు. ఆనందయ్య గారి మందు శాస్త్రీయంగా అనుమతి పొంది ప్రపంచాన్ని కాపాడుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆయనను దేవుడు చల్లగా ఆశీర్వదించాలంటూ ట్వీట్‌ చేశాడు.

కాగా ఆనందయ్య కరోనాకు ఇచ్చిన ఆయుర్వేద మందును ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం, ఐసీఎంఆర్, ఆయుష్‌ అధికారులు పరిశీలిస్తున్న విషయం తెలిసిందే. ఆ మందు ఎటువంటి హానికర పదార్థం కాదని ఇదివరకే స్పష్టత ఇచ్చారు. కేంద్రప్రభుత్వ ఐసీఎంఆర్, ఆయుష్‌ శాఖల పరిశీలన తర్వాత ఆనందయ్య మందుకు అనుమతి వస్తే టీటీడీ ఆధ్వర్యంలోని ఆయుర్వేద ఫార్మసీలోనే ఈ ఔషధం తయారు చేయించే అవకాశాలున్నాయి.