Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అప్పుడెప్పుడో బాహుబలి 2 విడుదలకి ముందు ఓ సినీ అభిమాని కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో వివరిస్తూ వాట్స్ అప్ లో సెకండ్ పార్ట్ స్టోరీ పెట్టాడు. బాగా లెంగ్తీగా సీన్ టూ సీన్ రాసిన ఆ అభిమాని రాసిన స్టోరీ బాగా క్లిక్ అయ్యింది. ఆ తర్వాత రిలీజ్ అయిన బాహుబలి 2 చూసాక ఆ అభిమాని రాసినట్టే వుంది కథ, కధనం. ఇప్పుడు జైలవకుశ రిలీజ్ కి ఓ రోజు ముందు ఆ సినిమా కథ అంటూ వాట్స్ అప్ లో ఓ మెసేజ్ వైరల్ అవుతోంది.ఇక్కడ కూడా ఆ సినీ ఔత్సాహికుడు సీన్ టూ సీన్ జైలవకుశ గురించి రాసాడు. అది నిజం అయినా కాకపోయినా వాట్స్ అప్ మెసేజ్ లో వున్న హైలైట్స్ మీకోసం అందిస్తున్నాం.
* ముగ్గురు అన్నదమ్ములు విడిపోతారు. ఇంటర్వెల్ టైం కి ఇద్దరు కలుస్తారు. అప్పుడే మూడో వ్యక్తి సీన్ లోకి వస్తాడు.
* ఫస్ట్ హాఫ్ లో రాశీ ఖన్నా,సెకండ్ హాఫ్ లో నివేద థామస్ కనిపిస్తారు.
* క్లయిమాక్స్ కి వచ్చేసరికి జై క్యారెక్టర్ మీద సింపతీ వస్తుంది.
* సెకండ్ హాఫ్ కూడా జనం అనుకున్నట్టు సీరియస్ గా కాక వినోద ప్రధానంగా సాగుతుందట.
* సెకండ్ హాఫ్ మొత్తం దాదాపు జై ఇంటిలో జరుగుతుందట.