రిలీజ్ డేట్ : ‘జంబ లకిడి పంబ’ ప్రివ్యూ

jambalakidi pamba movie release date preview

`జంబ‌లకిడి పంబ‌` అనే టైటిల్ ఒక‌టి వ‌స్తుంద‌ని కూడా ఎవ‌రూ ఊహించి ఉండ‌రు. వ‌చ్చిన‌ప్ప‌టి నుంచీ ఎవ‌రూ మ‌ర్చిపోలేదు. ఎందుకంటే ఆ టైటిల్ లోనే కామెడీ వైబ్రేషన్స్ అంతలా ఉన్నాయి మరి. తెలుగు ఆడియ‌న్స్ మనస్సులో ముద్ర వేసుకున్న సినిమా ఇది. అప్ప‌ట్లో అంత‌లా న‌వ్వించిన అద్భుత‌మైన సినిమా మరోటి లేదంటే అతిశయోక్తి కాదు. ఈవీవీగారు ద‌ర్శ‌క‌త్వ౦ వ‌హించిన ఆ థియేటర్ బయట పోస్ట‌ర్‌ ని, థియేట‌ర్‌లో సినిమా చూసిన‌ప్పుడు న‌వ్వుకున్న‌ న‌వ్వులు ఇప్ప‌టికీ మన వాళ్ళు మర్చిపోలేరు. అంత‌గా ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన టైటిల్‌తో సినిమా చేస్తున్న‌ప్పుడు ఇంకెంత జాగ్రత్హాలు తీసుకోవాలి, ఆ జాగ్రత్తలు అన్నీ తీసుకుని చేసింది నయా జంబలకిడి పంబ యూనిట్. కమెడియన్ శ్రీనివాస‌రెడ్డి `గీతాంజలి`, `జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా`, ఆనందో బ్రహ్మ వంటి వైవిధ్య‌మైన సినిమాల‌తో క‌థానాయ‌కుడిగా అడుగులు వేసిన శ్రీనివాస‌రెడ్డి క‌థానాయ‌కుడుగా నటిచిన సినిమా జంబలకిడి పంబ. శివ‌మ్ సెల్యూలాయిడ్స్, మెయిన్‌లైన్ ప్రొడ‌క్ష‌న్స్ కలిసి ఏ విషయంలొనూ రాజీ పడకుండా తెరెకేక్కించిన ఈ చిత్రంలో సిద్ధి ఇద్నాని క‌థానాయిక‌ గా, పోసాని కృష్ణ‌ముర‌ళి, వెన్నెల కిశోర్ వంటి ఎందరో మెయిన్ స్ట్రీమ్ కమెడియన్లతో రైట్ రైట్ డైరెక్టర్ మ‌ను ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి రానుంది.

అసస్లు ఈవీవీ గారి జంబలకిడి పంబ మూవీకి ఇప్పుడు రానున్న మూవీకి ఏమైనా సంబంధం ఉందా ? అంటే అదేమీ లేదని తేల్చేసారు చిత్ర దర్శకుడు మను. ఇంతకు ముందు కొన్ని సందర్బాలలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు ఈవీవీ గారి ‘జంబ ల‌కిడి పంబ‌’ సినిమా క‌ల్ట్ మూవీ అని అసలు ‘జంబ ల‌కిడి పంబ‌’ అనే ప‌దానికి అర్థం లేదు కానీ అదే టైటిల్‌గా పెట్టిన ఈ సినిమాతో ఈవీవీగారు కామెడీలో కొత్త కోణాన్ని చూపారని అప్ప‌టి సినిమాకు.. ఇప్పుడు మేం చేసిన సినిమాకు సంబంధం లేదు అని ఆయన చెప్పుకొచ్చారు. కుడిఎడమైతే పేరుతో పదేళ్ల క్రితం ఈ కథను సిద్ధంచేసుకుని దాదాపు 116 మందికి వినిపించగా కథకు అనుగుణంగా జంబలకిడిపంబ పేరు అయితేనే బాగుంటుందని ఆయన సన్నిహితులు సూచించడంతో అదే టైటిల్‌ను ఒకే చేసామని చెప్పుకొచ్చారు మను. ఈవీవీగారి మ్యాజిక్‌ను మ‌ళ్లీ మా సినిమా క్రియేట్ చేస్తుంద‌ని చెప్ప‌లేను అలాగే ఈవీవీ సత్యనారాయణ జంబలకిడిపంబ స్థాయిలో ఉంటుందని చెప్పడం అహంకారం అవుతుంది. అలాంటి బెంచ్‌మార్క్ సినిమాగా నిలవకపోయినా ఆ పేరుకున్న పరువును పోగొట్టదు అని మను చెప్పుకొచ్చారు.

అయితే ఇక సినిమా విషయానికి వస్తే ఇప్పటి తరం భార్యా భర్తలు ఎదుర్కుంటున్న మెయిన్ ప్రాబ్లం ఒకరిని ఒకరు అర్ధం చేసుకోలేకపోవడం. అలాంటి పెద్ద సబ్జెక్ట్ ని కామెడీ మిక్స్ చేసి ప్రజల మనసుల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నమే ఈ జంబలకిడి పంబ. వరుణ్, పల్లవి అనే భార్యాభర్తల కధ ఇతివృత్తంగా ఈ సినిమా సాగుతుంది. మొగుడు పెళ్ళాం లా, పెళ్ళాం మొగుడిలా ప్రవర్తించడానికి అసలు కారణమేమిటన్నది సినిమాలో ఆసక్తికర అంశం. ఇప్పటి వరకు వచ్చిన బాడీ స్వాపింగ్ కాన్సెప్ట్‌ సినిమాలకు భిన్నంగా సాగుతూ ఆద్యంతం నవ్వించనుంది. అయితే సినిమా సెకండ్ హాఫ్ లో శ్రీనివాసరెడ్డి పాత్ర ద్వారా మహిళల ఎదుర్కొంటున్న సమస్యల్ని సందేశాత్మకంగా చూపించారట. తన భార్య ఆత్మ శ్రీనివాస రెడ్డి బాడీలోకి వెళ్ళిన తర్వాత శ్రీనివాస రెడ్డి ఎక్స్ప్రెషన్స్ ఆకట్టుకుంటాయట. కథానాయిక పాత్ర కోసం దాదాపు ముప్ఫై ఆరు మందిని ఆడిషన్‌చేసి ఆ 36 మంది నుండి చివరికి సిద్ది ఇద్నానిని ఫైనల్ చేశారట. ఇక సిద్ది ఇద్నాని కూడా అంత పోటీని తట్టుకుని చేజిక్కించుకున్న పాత్రకు పూర్తిగా న్యాయం చేసినట్టు అర్ధం అవుతోంది. ట్రైలర్లో ఎక్కువసేపు కనిపించే ఆమె పెర్ఫార్మెన్స్ కు ప్రేక్షకుల నుండి పాజిటివ్ ఫీడ్ బ్యాకే వస్తోంది. మను – శ్రీనివాస రెడ్డిల జంబలకిడి పంబ ఎన్ని మ్యజిల్ లు చేయనుందో వేచి చూడక తప్పదు.