అంత లేదు.. అది పబ్లిసిటీ స్టంట్‌!

Sai Dharam Tej I Love You Units New Publicity Stunt

మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కిన ‘తేజ్‌ ఐలవ్‌ యు’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ చిత్రానికి కరుణాకరన్‌ దర్శకత్వం వహించగా కేఎస్‌ రామారావు నిర్మించాడు. నిర్మాతగా సుదీర్ఘ అనుభవం ఉన్న కేఎస్‌ రామారావు ఈ చిత్రాన్ని నిర్మించడంతో సినీ వర్గాల్లో కాస్త అంచనాలున్నాయి. తేజ్‌ గత చిత్రాలు వరుసగా ఫ్లాప్‌ అవ్వడంతో ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాపై నమ్మకంగా లేరు. తప్పకుండా ఈ సినిమా ఫ్లాప్‌ అవ్వడం ఖాయం అని ఎక్కువ శాతం విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే ఈ చిత్రం విడుదలకు సంబంధించి వాయిదాల మీద వాయిదాలు పడటంతో సినిమాను కొనుగోలు చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు లేనట్లున్నారు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. చిత్ర యూనిట్‌ సభ్యులు మాత్రం ఈ చిత్రం ఏకంగా 14 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చేసింది అంటూ ప్రచారం చేస్తున్నారు.

చిరంజీవి సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనడంతో పాటు, సినిమా టీజర్స్‌ ఆకట్టుకున్న కారణంగా సినిమాను బయ్యర్లు భారీ మొత్తానికి కొనుగోలు చేయడం జరిగింది అంటూ సమాచారం అందుతుంది. అయితే మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని, సినిమా అంత మొత్తంకు అమ్ముడు పోలేదని, పెట్టిన పెట్టుబడిలో కనీసం సగం కూడా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ రూపంలో రాలేదు అంటూ కొందరు అనధికారికంగా చెబుతున్నారు. మొత్తానికి ప్రీ రిలీజ్‌ బిజినెస్‌లో భాగా డబ్బులు వచ్చాయి అనేది కేవలం పుకార్లు మాత్రమే అని, పబ్లిసిటీ స్టంట్‌ అంటూ సినీ వర్గాల కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సినిమా సక్సెస్‌ అయితేనే నిర్మాతకు పెట్టుబడి రికవరీ అవుతుందని ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు.