సాయి పల్లవి కూడా 1990లోకి..!

Sai Pallavi is going to act like a 1990 village girl

ఈమద్య కాలంలో తెలుగు సినిమా పల్లెటూరులో ఎక్కువగా కనిపిస్తుంది. మొన్నటి వరకు సిటీ వాతావరణంలోనే ఎక్కువగా కొనసాగిన తెలుగు సినిమాలు ప్రస్తుతం పల్లెటూరుకు షిఫ్ట్‌ అయ్యాయి. పల్లెటూరు వాతావరణంలో సినిమాలకు మంచి ఆధరణ లభిస్తున్న నేపథ్యంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరు దర్శకులు కూడా వరుసగా పల్లెటూరు బాట పడుతున్నారు. ఇక తాజాగా పాత తరంకు ప్రేక్షకులను తీసుకు వెళ్లేందుకు వరుసగా దర్శకులు సిద్దం అవుతున్నారు. ఇటీవలే సుకుమార్‌ ‘రంగస్థం’ చిత్రంతో ప్రేక్షకులను 1980లలోకి తీసుకు వెళ్లాడు. తాజాగా శర్వానంద్‌ కూడా పాత తరంను ప్రేక్షకులకు చూపించేందుకు సిద్దం అవుతున్నాడు. ఇలాంటి సమయంలోనే మరో రెండు సినిమాలు కూడా ఫ్ల్యాష్‌బ్యాక్‌కు తీసుకు వెళ్లేందుకు రెడీ అవుతున్నాయి.

నాని హీరోగా గౌతమ్‌ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ‘జెర్సీ’ చిత్రం 1980 నేపథ్యంలో ఉండబోతుంది. ఇక తాజాగా ‘నాది నీది ఒకే కథ’ అనే చిత్రంతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు వేణు ఉడుగుల ఒక చిత్రానికి సిద్దం అవుతున్నాడు. ఆ సినిమాలో 1990లలో తెలుగు అమ్మాయిలు, ముఖ్యంగా పల్లెటూరు అమ్మాయిు ఎలా ఉండే వారు, వారు ఎదుర్కొన్న పరిస్థితు ఏంటీ అనే విషయాను చూపించేందుకు సిద్దం అవుతున్నాడు. ఈ చిత్రంలో సాయి పల్లవి ప్రధాన పాత్రలో కనిపించబోతుంది. హీరోయిన్‌ ఓరియంటెడ్‌ కథాంశంతో ఈ చిత్రం రూపొందబోతుంది. సాయి పల్లవి 1990 పల్లెటూరు అమ్మాయిగా కనిపించబోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెళ్లడయ్యే అవకాశం ఉంది. వరుసగా పాత తరంలోకి దర్శకులు ప్రేక్షకులను తీసుకు వెళ్తుండటం కాకతాళియంగా జరుగుతుందా లేదంటే ఒకరిని చూసి ఒకరు ఇలాంటి ప్రాజెక్ట్‌లను సిద్దం చేస్తున్నారా అంటూ సినీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు.