ప్రపంచంలోనే ఇప్పటి వరకు అత్యధికంగా వసూళ్లు సాధించిన చిత్రం ఏది అంటే ఠక్కున వినిపించే పేరు ‘అవతార్’. అద్బుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో తెరకెక్కించిన అవతార్ చిత్రం వచ్చి 9 ఏళ్లు అయ్యింది. అయినా కూడా ఇప్పటి వరకు అవతార్ రికార్డును బ్రేక్ చేసే సత్తా ఉన్న సినిమా ఒక్కటి కూడా రాలేదు. 2.7 బిలియన్ డాలర్లను వసూళ్లు చేసిన ఈ చిత్రంకు సీక్వెల్స్ రాబోతున్న విషయం తెల్సిందే. ప్రపంచ దిగ్గజ దర్శకుడు, దిగ్రేట్ జేమ్స్ కామరున్ ఇప్పటికే సినిమాకు సంబంధించిన సీక్వెల్స్ వరుసగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. తాజాగా ‘అవతార్’ రెండు మరియు మూడు పార్ట్‌లకు సంబంధించిన సీక్వెల్ షూటింగ్ పూర్తి చేసుకుంది.
‘అవతార్’ చిత్ర యూనిట్ సభ్యులు రెండు మరియు మూడు సీక్వెల్స్ షూటింగ్ పూర్తి అయిన వెంటనే లోగోను ఆవిష్కరించడం జరిగింది. లోగోలో దర్శకుడు కెమెరున్ తన కాన్సెప్ట్‌ను చెప్పకనే చెప్పాడు. మొదటి పార్ట్ కంటే ఇప్పుడు అద్బుతమైన విజువల్స్‌ను ప్రేక్షకుల ముందు ఉంచబోతున్నాడట. అప్పట్లో పెద్దగా టెక్నాలజీ లేని సమయంలోనే అవతార్‌ను విజువల్ వండర్‌గా చూపించిన కామెరూన్ రెండు మూడు పాత్రల్లో ప్రేక్షకుల కళ్లు కూడా నమ్మని విధంగా విజువల్స్‌ను ఉంచబోతున్నాడట. ఇప్పటికే అవతార్ 2 ను 2020 డిసెంబర్ 18న, అవతార్ 3 చిత్రాన్ని 2021 డిసెంబర్ 17న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ రెండు సీక్వెల్స్ తో పాటు ఇంకా ముందు ముందు పలు సీక్వెల్స్ కూడా వస్తాయని కామెరూన్ చెబుతున్నాడు.