జమ్మూకశ్మీర్లో బుధవారం భద్రత సిబ్బందికి, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో భద్రత సిబ్బంది ఇద్దరు ఉగ్రవాదులను కాల్చిచంపారు. కాగా, జమ్మూలోని షోపియన్ జిల్లా డ్రాగడ్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో భద్రత సిబ్బంది కార్డన్ సెర్చ్ నిర్వహించారు. దీంతో ఒక్కసారిగా ఉగ్రవాదులకు, భద్రత సిబ్బందికి మధ్య కాల్పులు సంభవించాయి.
గత కొన్ని రోజులుగా టెర్రరిస్ట్లు అమాయక వలసకూలీలను టార్గెట్గా చేసుకుని కాల్పులు జరుపుతున్నారు. ఈ కాల్పులలో ఇప్పటికే అమాయక కూలీలు మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో భయపడిపోయిన కూలీలు ఇప్పటికే జమ్మూ విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు.