నోరు హద్దులో పెట్టుకోండి…బెదిరిస్తున్నట్టు తెలిసింది…తోలు తీస్తా….!

Janasena Chief PaPawan Kalyan Comments On Caste Politicswan Kalyan Fires On TDP Leaders

జనసేన మీద విమర్శలు చేస్తున్న టీడీపీ నేతల మీద పవన్ కల్యాణ్ మండిపడ్డారు. తుపాను బాధిత ప్రాంతాల్లో తాను పర్యటించలేదంటూ టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు అర్థం లేనివని అన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ప్రభుత్వ యంత్రాంగం చేపట్టిందని తాను వెళ్తే పనులకు ఆటంకం కలుగుతుందని, అందుకే వెళ్ల లేదని చెప్పారు. ధవళేశ్వరం బ్యారేజ్ పై కవాతు కోసం తాను పర్యటనను వాయిదా వేసుకోలేదని అన్నారు. తమను విమర్శించే విషయంలో టీడీపీ నేతలు కొంచెం నిగ్రహం పాటించాలని చెప్పారు. వరుస ట్వీట్లతో పవన్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.జనసేన అనేది ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీ అని తమ పర్యటనలపై విమర్శలు చేయవద్దని టీడీపీ నేతలను కోరుతున్నానని పవన్ అన్నారు. మీ గెలుపు వెనక జనసేన ఉందనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పారు. తమ మీద చేసే ప్రతి విమర్శకు టీడీపీ నేతలు భవిష్యత్తులో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రతి విషయాన్ని తాము గుర్తుంచుకుంటామని చెప్పారు. తుపాను సంభవించి ఆరు రోజులు గడిచినా ఇంకా సగం గ్రామాలు చీకట్లోనే ఉన్నాయని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ముఖ్యమంత్రి గారు ఈ చీకటి సమయంలో వారి బతుకుల్లో వెలుగు నింపండి’ అంటూ ట్వీట్ చేశారు.

pawan-cm
తుపాను వల్ల పచ్చటి ఉద్దానం మొత్తం నాశనం అయిపోయిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. నేలకూలిన ఇళ్లు, తోటలు చూస్తుంటే తనకు కన్నీళ్లు వస్తున్నాయని అన్నారు. మూడు రోజుల పాటు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తానని జరిగిన విధ్వంస నష్టాన్ని పార్టీ తరపున నమోదు చేస్తామని చెప్పారు. ఆ తర్వాత రంగాల వారీగా నష్ట నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపుతానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, బాధితులకు న్యాయం చేస్తానని చెప్పారు. ప్రజలకు సాయం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని పవన్ విమర్శించారు. కేరళకు తుపాను వస్తే ప్రపంచం మొత్తానికి తెలిసిపోయిందని ఇక్కడి తుపాను బయట ప్రపంచానికి తెలియడం లేదని అన్నారు. తుపాను నష్టాన్ని వీడియోల రూపంలో బయట ప్రపంచానికి తీసుకెళ్తామని చెప్పారు. కూరగాయల ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. ప్రజలను కొందరు అధికారులు బెదిరిస్తున్నట్టు తెలిసిందని అలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే తోలు తీస్తానని హెచ్చరించారు.

pawan-kalyan