గల్లా వారబ్బాయి హీరోగా సినిమా మొదలయ్యింది…!

Mahesh Babu Nephew New Movie Adhey Nuvvu Adhey Nenu

సూపర్ స్టార్ మహేష్‌బాబు మేనల్లుడు, ప్రముఖ వ్యాపారవేత్త, ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు గల్లా అశోక్ హీరోగా పరిచయమవుతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తోన్న ‘అదేనువ్వు అదేనేను’ చిత్రం ద్వారా ఆయన సినీ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సినిమా ద్వారా శశి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ భామ నభా నటేష్ ఈ చిత్రంలో అశోక్ సరసన నటిస్తోంది. ఈ చిత్రాన్ని గురువారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభించారు. పూజాకార్యక్రమాలు నిర్వహించి తొలి షాట్‌ను చిత్రీకరించారు.

mahesh-babu
ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ కృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి తొలి షాట్‌కు క్లాప్‌ నిచ్చారు. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు కెమెరా స్విచాన్ చేశారు. అలాగే ఈ కార్యక్రమంలో గల్లా జయదేవ్ తల్లిదండ్రులు గల్లా రామచంద్రనాయుడు, గల్లా అరుణ కుమారి జయదేవ్ భార్య గల్లా పద్మావతితో పాటు ఘట్టమనేని మంజుల, దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

mahesh-babu-movies