‘ఎన్టీఆర్‌’లో హరికృష్ణగా కళ్యాణ్ రాం లుక్‌ ఇదే…!

Kalyan-Ram-First-Look-Poste

నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ, నటిస్తోన్న ఈ సినిమా రెండు భాగాలుగా(కథానాయకుడు, మహానాయకుడు)గా రానుంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన మరో పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఎన్టీఆర్‌గా బాలకృష్ణ, ఆయన కుమారుడు హరికృష్ణగా కళ్యాణ్‌రామ్‌ ఉన్న ఫొటోను విజయదశమి సందర్భంగా రిలీజ్ చేశారు.

ntr-bio-pic-pposter

బాలకృష్ణ ఠీవిగా కూర్చుని వుండగా కళ్యాణ్‌రామ్‌ ఆయన పక్కన వంగి ఉన్నట్టుగా బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటో అభిమానులకు కనువిందు చేస్తోంది. ‘విజయం మీది.. విజయరథ సారధ్యం నాది.. నీడలా వెన్నంటి వుంటా నాన్నగారూ’ అంటూ డైలాగ్‌ కూడా పెట్టారు. విద్యాబాలన్‌, దగ్గుబాటి రానా ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కథానాయకుడు జనవరి 9, మహానాయకుడు జనవరి 24న విడుదల కానున్నాయి.

Kalyan Ram In NTR Biopic