దేవ్ రూపంలో బట్టబయలు అయిన బీజేపీ-పవన్ బంధం !

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ ఆఫీస్‌లో కార్యకర్తలతో సమావేశమయ్యారు. జ‌న‌సేన పార్టీ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా దేవ్ ని నియమిస్తూ ఆయన్ని పార్టీ శ్రేణులకి పరిచయం చేశారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ఎన్నికల్లో ఎలా పోటీకి దిగుతున్నాం అనే అంశాలను వివరించారు. తాను కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ (సీపీఎఫ్‌) ఏర్పాటు చేసినప్పటి నుంచి ఉన్న కార్యకర్తలు, దేవ్ టీం కలసి ఎన్నికల ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తారని ఆ 1200 మంది సిపిఎఫ్ కార్యకర్తలు దేవ్ కు సహకరిస్తారు. 350 మందితో దేవ్ టీమ్ ఉంటుందని. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ పార్టీ కమిటీలు ఎలా ముందుకు వెళ్లాలో బలమైన ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని పవన్ ప్రకటించారు.

ఈ సందర్భంగా దేవ్‌ తనను తాను పరిచయం చేసుకున్నారు. ఇంగ్లీష్ లో తన ప్రసంగాన్ని మొదలు పెట్టి తనకు తెలుగు పెద్దగా రాదంటూ చిన్న క్లారిఫికేషన్ ఇచ్చిమరీ ఇంగ్లీష్ లో స్పీచ్ దంచేశాదు దేవ్. పలు జాతీయ, అంతర్జాతీయ పార్టీలలో సర్వేలు, వ్యూహాలు రచించిన పదేళ్ల అనుభవం తనదని చెప్పుకొచ్చారు. తనదగ్గరున్న 350 మంది టీంతో జనసేన పార్టీని 2019 ఎన్నికల్లో విజయతీరాలకు ఎలా తీసుకెళ్లాలి? ఎన్నికల మందు, ఎన్నికల తర్వాత ఎలా వ్యూహాత్మకంగా వెళ్లబోతున్నామో చెప్పే ప్రయత్నం చేశారు.

దీంతో ఒక్కసారిగా దేవ్ ఎవరు ?.. ఏంటి ? ఎక్కడినుంచి వచ్చాడీ రాజకీయ వ్యూహకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తంటూ జగన్ పరిచయం చేసిన ప్రశాంత్ కిషోర్ కి ఇతనికి ఏమన్నా సంబంధం ఉందా ? ఉంటె ఏమిటా సంబంధం ? అనే సందేహాలు సాధారణంగానే అందరిలోనూ మెదిలాయి. కాని తెలుగుదేశం సోషల్ మీడియా వింగ్ మాత్రం ఆ రహస్యాలని చేధించింది. అంతా కలిపి 24 గంటలు కాలేదు, పవన్ చేసిన మోసాన్ని తెలుగు దేశం కారకర్తలు వెలుగు లోకి తెచ్చారు. మోసం అంటున్నారు ఏమిటా అనుకుంటున్నారా ?

పవన్ కళ్యాణ్ అంత బిల్డప్ ఇచ్చిన వ్యక్తి ఎక్కడి వ్యక్తో తెలిస్తే మీకూ మండడం గ్యారంటీ… హాయ్ దిస్ ఈజ్ దేవ్ అంటూ పరిచయం చేసుకున్న ఈ దేవ్ అస‌లు పేరు వాసుదేవ్‌..! పుట్టింది, పెరిగింది కేరాఫ్ చింత‌ల్ బ‌స్తీ, మన తెలంగాణ‌, తెలుగులో మాట్లాడ‌టం ఏంటి ఏకంగా పోట్లాడటం కూడా భేషుగ్గా. ఎందుకంటే ఈయన గ‌తంలో ఈయ‌న భారతీయ జ‌న‌తా పార్టీకి ప్ర‌తినిధిగా కూడా ప‌నిచేశారు. ఆ సంద‌ర్భంగా వివిధ న్యూస్ ఛానెల్స్ నిర్వ‌హించిన చ‌ర్చా కార్య‌క్ర‌మాల్లో పాల్గొనేవారు. ఈయ‌న తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కుడు దామోద‌ర్ రాజ‌న‌ర‌సింహ‌కి బంధువు కూడా.

తెలుగు భాషలోనే బీజేపీకి వత్తాసు పలుకుతూ ఎన్నో డిబేట్లలో పాల్గొన్నాడు కూడా. దీంతో బీజేపీ వాసుదేవ్ గా తెలుగు న్యూస్ ఛానల్స్ రిపోర్టర్లకి ఇతను పరిచయమే. అలాంటి వాసుదేవ్.. తనకు తెలుగు సరిగా రాదని జనసేన కార్యకర్తల బిల్డప్‌లిస్తూ ఒక రకమయిన ఆటిట్యూడ్ చూపిస్తూ మాట్లాడటం అనేది అనుమానాలని రేకెత్తిస్తున్న అంశం. దేశ విదేశాల్లో ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించాన‌నీ, పదేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది అని అనుభ‌వం తనదని ప‌రిచ‌యం చేసుకోవ‌డం వెనుక ఏమి స్కెచ్ ఉంది అనేది ఆలోచించాల్సిన విషయం. ఇతను చూస్తే బీజేపీ మనిషి , ప్రశాంత్ కిషోర్ కూడా ఒకప్పుడు మోడీ కోసం పని చేసిన వ్యక్తే ఇవన్నీ కలిపి చూస్తుంటే హీరో శివాజీ బట్టబయలు చేసిన ఆపరేషన్ గరుడ అమలు అవుతుందా అనే అనుమానం కలుగుతోంది.

బీజేపీ చేతిలో తోలు బొమ్మలా మారిన పవన్ కళ్యాన్ ఇప్పుడు తన ఫ్యాన్స్ ముందే దోషిగా నిలబడే పరిస్థితి. దేవ్ పక్కా లోకల్ అయినా అతన్నేదో పెద్ద ఇమేజ్ ఉన్న వ్యక్తిగా చూపించాలి అని పవన్ పడ్డ తాపత్రయం , అతన్ని ఒక నార్త్ ఇండియన్ గా చూపించటానికి పవన్ పడ్డ కష్టాన్ని పవన్ అభిమానులే ఇప్పుడు అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడింది. పవన్ నిజాయితీ కి మారుపేరు అనుకున్న పవన్ ఫాన్స్ ఒక రకం అయిన షాక్ లో ఉన్నారనే చెప్పాలి. బీజేపీ పెద్దలే జనసేనకు అండగా దేవ్ ని రంగంలోకి దింపారా ? అనే అనుమానం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికయినా పవన్ స్పందించి ఈ విషయం మీద క్లారిటీ ఇవ్వకుంటే పరిస్థితి మరింత చేయి దాటే పరిస్థితి కనపడుతోంది.