జనసేన మొదటి లిస్ట్…నేటి నుండే ప్రచారంలోకి !

Janasena Chief PaPawan Kalyan Comments On Caste Politicswan Kalyan Fires On TDP Leaders
సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం చేసుకుంటున్న ఏపీలోని ప్రధాన పార్టీలు టికెట్ల కేటాయింపులో మునిగి తేలుతున్నాయి. అధికార పార్టీ తెలుగుదేశం ఇప్పటికే మెజారిటీ సీట్లకు అభ్యర్థులను నిర్ణయించగా, చివరి నిమిషంలో జాబితాలో మార్పుచేర్పులతో వైసీపీ బిజీగా ఉంది. పవన్ సారథ్యంలోని జనసేన పార్టీ కూడా లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ బుధవారం అర్ధరాత్రి మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో 32 మందితో కూడిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాతోపాటు లోక్‌సభలో పోటీపడే నలుగురి పేర్లను ప్రకటించారు.
జనసేన ప్రకటించిన శాసనసభ అభ్యర్థుల పేర్లు ఇలా ఉన్నాయి.
1. య‌ల‌మంచిలి- సుంద‌ర‌పు విజ‌య్‌కుమార్‌
2. పాయ‌క‌రావుపేట- న‌క్కా రాజ‌బాబు
3. పాడేరు – ప‌సుపులేటి బాల‌రాజు
4. రాజాం- డాక్టర్ ముచ్చా శ్రీనివాస‌రావు
5. శ్రీకాకుళం- కోరాడ స‌ర్వేశ్వర  రావు
6. ప‌లాస‌- కోత పూర్ణచందర్ రావు
7. ఎచ్చెర్ల – బాడ‌న వెంక‌ట‌ జనార్థన్
8. నెల్లిమ‌ర్ల- లోకం నాగ‌మాధ‌వి
9. తుని- రాజా అశోక్‌బాబు
10. రాజ‌మండ్రి సిటీ- కందుల దుర్గేష్‌
11. రాజోలు- రాపాక వ‌ర‌ప్రసాద్
12. పి. గన్నవరం- పాముల రాజేశ్వరి
13. కాకినాడ సిటీ- ముత్తా శ‌శిధ‌ర్‌
14. అన‌ప‌ర్తి- రేలంగి నాగేశ్వరరావు
15. ముమ్మిడివ‌రం- పితాని బాల‌కృష్ణ
16. మండ‌పేట‌- వేగుళ్ల లీలాకృష్ణ
17. తాడేప‌ల్లిగూడెం- బొలిశెట్టి శ్రీనివాస్‌
18. ఉంగుటూరు- న‌వుడు వెంక‌ట‌ర‌మ‌ణ‌
19. ఏలూరు- రెడ్డి అప్పలనాయుడు
20. తెనాలి- నాదెండ్ల మ‌నోహ‌ర్‌
21. గుంటూరు వెస్ట్‌ – తోట చంద్రశేఖర్
22. ప‌త్తిపాడు- రావెల కిషోర్‌బాబు
23. వేమూరు- డాక్టర్ ఎ. భ‌ర‌త్ భూష‌ణ్‌
24. న‌ర‌స‌రావుపేట‌- స‌య్యద్ జిలానీ
25. కావ‌లి- ప‌సుపులేటి సుధాక‌ర్‌
26. నెల్లూరు రూర‌ల్‌- చెన్నారెడ్డి మ‌నుక్రాంత్ రెడ్డి
27. ఆదోని- మ‌ల్లిఖార్జున‌రావు
28. ధ‌ర్మవ‌రం- మ‌ధుసూద‌న్‌రెడ్డి
29.రాజంపేట‌- ప‌త్తిపాటి కుసుమ‌కుమారి
30. రైల్వే కోడూరు- డాక్టర్ బోనాసి వెంకటసుబ్బయ్య
31. పుంగ‌నూరు- బోడే రామ‌చందర్ యాద‌వ్‌
32. మ‌చిలీప‌ట్నం- బండి రామ‌కృష్ణ
లోక్‌సభ అభ్యర్థులు
1. అమ‌లాపురం- డి.ఎం.ఆర్ శేఖ‌ర్‌
2. రాజ‌మండ్రి- డాక్టర్ ఆకుల సత్యనారాయణ
3. విశాఖ‌ప‌ట్నం- గేదెల శ్రీనుబాబు
4. అన‌కాప‌ల్లి- చింత‌ల పార్థసారథి
ఇక పార్టీ ఏర్పాటు చేసి ఐదేళ్ళు అయిన సందర్భంగా గురువారం రాజమండ్రిలో జనసేన పార్టీ ఆవిర్భావ సభను నిర్వహిస్తున్నారు. ఇందుకు ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం మూడు గంటలకు సభ ప్రారంభం కానుండగా, 13 జిల్లాల నుంచి భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు తరలిరానున్నారు. కాగా, ఈ సభలోనే పవన్ కల్యాణ్ తన మేనిఫెస్టోను ప్రకటిస్తారని జనసేన వర్గాలు భావిస్తున్నారు. ఇక్కడ నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్న పవన్, ఈ సభకు యుద్ధ శంఖారావంగా నామకరణం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చోయబోతామనే అంశాలను పవన్ ఈ సభ ద్వారా వెల్లడించే అవకాశం ఉందని భావిస్తున్నారు.   గత అక్టోబరులో ఇక్కడ నిర్వహించిన జనసేన కవాతు విజయవంతమైన నేపథ్యంలో ఆవిర్భావ సభను కూడా రాజమండ్రిలోనే నిర్వహించాలని పవన్‌ కల్యాణ్‌ నిర్ణయించారు. ఇందుకు తగ్గ ఏర్పాట్ల బాధ్యతలను ఆకుల సత్యనారాయణ, కందుల దుర్గేష్‌ తదితరులకు అప్పగించారు.