సునీత బ్యాక్…శ్రీ రామ్ ఇన్ !

Will Paritala Family Survive Well In 2019 Elections

అనంతపురం జిల్లాలో విచిత్ర పరిస్థితి నెలకొంది. వారసుల కోసం నేతలు తమ సీట్లనే త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే జేసీ సోదరులు వారసుల కోసం తాము ఎన్నికల్లో పోటీ చేయమని ప్రకటించగా వారి బాటలో మంత్రి పరిటాల సునీత నడవనున్నారు. ప్రస్తుతం రాప్తాడు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సునీత.. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు పరిటాల శ్రీరామ్‌ను బరిలోకి దించనున్నట్లు సమాచారం. ఇందుకోసం తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆమె నిర్ణయించుకున్నట్లు సమాచారం. అభిమానులు, శ్రేయోభిలాషుల కోరిక మేరక తన కుమారుడు శ్రీరామ్‌ను ఎన్నికల బరిలో నిలబెడుతున్నట్లు సునీత కార్యకర్తల సమావేశంలో వెల్లడించారు. తమ కుటుంబానికి రెండు సీట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబును అడిగామని, ఒకవేళ పార్టీ అందుకు అంగీకరించకపోతే తాను పోటీ విరమించుకుని శ్రీరామ్‌ను రాప్తాడు నుంచి పోటీ చేయిస్తానని ఆమె తెలిపారు. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.