నిరాశలో ఉన్న జనసైనికులు

నిరాశలో ఉన్న జనసైనికులు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర ప్రాంత అసెంబ్లీ, పార్లమెంట్ నియోజక వర్గాలకి గానూ ఇంచార్జిలు గా ఆయా ప్రాంత నాయకులని నియమించారు. అయితే రాజోలు నియోజక వర్గానికి గాను జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారిని మళ్ళి నియమించడం జరిగింది. అయితే ఈ విషయం లో పవన్ అభిమానులు, జనసైనికులు కొంతమేరకు నిరాశలో వున్నారని తెలుస్తుంది.జనసేన పార్టీ తరపున గెలిచినా ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రతి చోట ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి అనుకూలంగానే వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఆంగ్ల మాధ్యమం విషయం లో పవన్ కి వ్యతిరేకంగా ఏకంగా అసెంబ్లీలో జగన్ కి మద్దతు తెలిపారు. ఆరోగ్య శ్రీ విషయంలో, మూడు రాజధానుల విషయంలో ఇంకా చాలానే. అయితే పార్టీ కి , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని తెలిపిన రాపాక ఆ తర్వాత ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. కానీ జనసేన మాత్రం రాపాక కి ఇంకా ప్రాధాన్యతని ఇస్తూనే వుంది. రాపాక వైసీపీ లోకి చేరతారనే ప్రచారం కూడా ఆ మధ్య బాగానే జరిగింది. మరి అంతలా దూరం ఏర్పడినప్పటికీ పవన్ కళ్యాణ్ మళ్ళి ఇంచార్జ్ గా నియమించడం తో పవన్ సరైన నిర్ణయం తీసుకున్నారా? అంటూ కొందరు చర్చలు జరుపుతున్నారు.