‘దేవర’లో జాన్వీ.. ఫుల్ మాస్ మోడ్‌లో!

Janhvi in ​​'Devara'.. in full mass mode!
Janhvi in ​​'Devara'.. in full mass mode!

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్‌లో సాలిడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతోన్న ‘దేవర మూవీ లో హీరోయిన్‌గా ఈ బ్యూటీ తన సత్తా చాటేందుకు రెడీ అయ్యింది. దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ మూవీ లో అమ్మడు తన నటనతో పాటు గ్లామర్ డోస్‌తో ఆడియెన్స్‌ని ఉక్కిరిబిక్కిరి చేసేందుకు సిద్ధమైంది. ఇక ఈ మూవీ నుంచి ఇటీవల ‘చుట్టమల్లె’ అనే రొమాంటిక్ సాంగ్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.

Janhvi in ​​'Devara'.. in full mass mode!
Janhvi in ​​’Devara’.. in full mass mode!

ఈ పాటని రొమాంటిక్ మెలోడీగా చిత్ర యూనిట్ ప్రెజెంట్ చేయనుంది. ఈ పాటలో జాన్వీ తన అందాలతో కుర్రకారుని ఆకట్టుకుంటోంది. ఈ పాట రిలీజ్ అయ్యి రోజులు గడుస్తున్నా యూత్ ఈ పాటకి అట్రాక్ట్ అయ్యి అదే మేనియాలో ఊగిసలాడుతున్నారు. అటు జాన్వీ కూడా ఈ పాటకి బాగా అడిక్ట్ అయ్యిందట. ఆమె తన సోషల్ మీడియాలో రోజూ ఈ పాటకి సంబంధించి ఏదో ఒక విషయాన్ని రివీల్ చేస్తూ అభిమానులు అలరిస్తోంది.

తాజాగా ఈ పాట హిందీ వర్షెన్‌కు అమ్మడు ఒక రీల్ చేసి తన ఇన్‌స్టా లో పోస్ట్ చేసింది. ఈ రీల్‌కి అభిమానులు బాగా ఫిదా అవుతున్నారు. తన అందంతో అభిమానుల గుండెల్ని చుట్టేస్తోంది అని అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక దేవర మూవీ ని సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

https://www.instagram.com/reel/C-fBULhoAzS/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==