జాన్వీ కపూర్ పై స్పెషల్ సాంగ్ ప్లాన్..ఓకే అంటుందా ..లేదా..?

Cinema News

దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా “గేమ్ చేంజర్” మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబు సానాతో ఒక భారీ చిత్రం చేయబోతున్నాడు. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ ఉందట. బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ తో ఈ ఐటమ్ సాంగ్ ని చేయిస్తే బాగుంటుందని మేకర్స్ ఫీల్ అవుతున్నారు. జాన్వీ కపూర్ ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర మూవీ లో నటిస్తోంది.

జాన్వీ కపూర్ స్పెషల్ సాంగ్ .....
Janvi Kapoor

అలాగే ఇక నుంచి వరుసగా తెలుగు మూవీ లు చేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో జాన్వీ కపూర్ ఐటమ్ సాంగ్ చేయడానికి ఒప్పుకుంటుందా ? లేదా ? అనేది చూడాల్సిఉంది . ఏది ఏమైనా చరణ్ సరసన జాన్వీ కపూర్ గాని ఐటమ్ సాంగ్ చేస్తే అదిరిపోతుంది. కాగా ఈ భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా లో ఒక అతిథి పాత్ర ఉందని ఇప్పటికే వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ అతిథి పాత్రలో ఒక బాలీవుడ్ స్టార్ ను కూడా తీసుకుంటారని తెలుస్తుంది . ఐతే, ఆ బాలీవుడ్ స్టార్ ఎవరు అనేది తెలియాల్సి ఉంది. అలాగే ఆ మధ్య ఈ మూవీ లో విజయ్ సేతుపతి కూడా విలన్ గా నటిస్తున్నాడు అని ప్రచారం చేశారు. మరి ఈ వార్తలో ఎలాంటి నిజం ఉందో అనేది చూడాలి.