దేవరకొండ పక్కన జాన్వీ కపూర్​

దేవరకొండ పక్కన జాన్వీ కపూర్​

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్​ తనదైన నటనతో బాలీవుడ్​లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘ధడక్’ సినిమాతో బీటౌన్​లో ఎంట్రీ ఇచ్చి ప్రశంసలు దక్కించుకుంది. నటనతోనే కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్​గా ఉంటూ అభిమానులకు టచ్​లో ఉంటుంది. ఇప్పటివరకు బాలీవుడ్​లో గుర్తింపు పొందిన ఈ బ్యూటీ త్వరలో సౌత్​లో ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. అది కూడా జాన్వీ ఫేవరెట్ హీరోతో అని టాక్​. అతనెవరో కాదు రౌడీ హీరో విజయ్​ దేవరకొండ.

బాలీవుడ్​ దర్శక నిర్మాత కరణ్​ జోహార్​ నిర్మాణంలో తెరకెక్కించే చిత్రంలో విజయ్ దేవరకొండకు పక్కన హీరోయిన్​గా జాన్వీ కపూర్​ నటించనుందట. తెలుగు, హిందీతోపాటు ఇతర భాషల్లోనూ విడుదలవుతున్న ఈ సినిమాకు డ్యాషింగ్ డైరెక్టర్​ పూరీ జగన్నాథ్​ దర్శకత్వం వహించనున్నాడని సమాచారం. అయితే ‘లైగర్’ మూవీలో మందుగా హీరోయిన్​గా జాన్వీనే అనుకున్నారట. కానీ కుదర్లేదు. అలాగే జాన్వీని మొదట తెలుగులోనే కథానాయికగా పరిచయం చేయాలనుకున్నారు శ్రీదేవి. ఫైనల్​గా ఈ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.