చంద్రునిపై నివ‌సించ‌వ‌చ్చు?

Japan Scientists found a Huge 50km long moon cave

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

చంద్రునిపై నివాసం కోసం మ‌నిషి కంటున్న‌క‌ల‌లు నెరవేరే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. చంద్రునిపై నివాస‌యోగ్యానికి అనుకూలంగా ఉండే ఓ భారీ గుహ‌ను జ‌పాన్ అంత‌రిక్ష ప‌రిశోధ‌కులు క‌నుగొన్నారు చంద్రునిపై మ‌నిషి నివ‌సించడానికి వీలుకాని ప్ర‌మాద‌క‌ర‌మైన రేడియేష‌న్, ఉష్టోగ్ర‌త‌ల మార్పుల నుంచి ఈ గుహ రక్ష‌ణ క‌ల్పించ‌నుంది. చంద్రునిపై కాలుమోపే వ్యోమ‌గాముల‌కు ఈ గుహ ఆవాసంగా మారే అవ‌కాశాలు ఉన్నాయ‌ని భావిస్తున్నారు. జ‌పాన్ కు చెందిన సెలెన్ లూనార్ ఆర్బిట‌ర్ నుంచి జపాన్ అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ డేటా సేక‌రించి ఎనాల‌సిస్ చేయ‌గా చంద్రునిపై ఈ గుహ విష‌యం వెలుగుచూసింది.

భారీ గుహ 50 కిలోమీట‌ర్ల పొడ‌వు, 100 మీట‌ర్ల వెడ‌ల్పు ఉన్న‌ట్టు శాస్త్ర‌వేత్త‌లు అంచ‌నావేశారు. 3.5 బిలియ‌న్ ఏళ్ల క్రితం ఈ గుహ ఏర్ప‌డిన‌ట్టు భావిస్తున్నారు. చంద్రునిపై అగ్నిప‌ర్వ‌త విస్ఫోట‌నం ద్వారా వ‌చ్చిన లావాతో ట్యూబ్ మాదిరిగా ఈ గుహ ఏర్ప‌డింద‌ని శాస్త్ర‌వేత్త‌లు అంచనాకొచ్చారు. ఈ ప‌రిశోధ‌న‌కు సంబంధించిన వివ‌రాలు యూఎస్ సైన్స్ మ్యాగ‌జైన్ జియో ఫిజిక‌ల్ రీసెర్చ్ లెట‌ర్స్ లో ప్ర‌చురిత‌మ‌య్యాయి. చంద్రునిపై ఇప్ప‌టిదాకా జ‌రిగిన ప‌రిశోధ‌న‌ల్లో ఇది గొప్ప ముంద‌డుగుగా భావిస్తున్నారు.