రాకెట్ ప్రయోగమంటే అంత ఆషామాషీ కాదు. దాని తయారీ ప్రక్రియ నుంచి ఆకాశంలో ఎగిరేలా చేయడం ఒక ఎత్తైతే.. దాన్ని అంతరిక్షంలో నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టడం పెద్ద సవాల్. కానీ మొన్న జరిగిన ఒక ఘటన ఇప్పుడు ప్రపంచాన్నే ఆశ్చర్య పరుస్తోంది. అదేంటంటే టెక్నాలజీలో ఎప్పుడూ ముందుండే జపాన్ ఇటీవల రాకెట్ ప్రయోగాల్లో చేదు అనుభవాలను ఎదుర్కొంటోంది. తాజాగా ఈ శనివారం ప్రయోగించిన ఇంటర్‌స్టెల్లార్ టెక్నాలజీస్ మోమో-2 రాకెట్ ప్రయోగం దారుణంగా విఫలమైంది. రాకెట్ కనీస దూరం కూడా ప్రయాణించకుండా కేవలం 60 అడుగుల ఎత్తుకు ఎగిరి ఒక్కసారే కుప్పకూలింది. దాదాపు 2.7 మిలియన్ డాలర్లను ఖర్చు చేసి తయారు చేసిన రాకెట్‌ను దక్షిణ హొకైడో ద్వీపంలోని టైకి అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించారు. గతేడాది మోమో రాకెట్ ప్రయోగం కూడా ఇదే తరహాలో విఫలమైంది. రాకెట్ కుప్పకూలగానే ఆ ప్రాంతంలో భారీగా మంటలు వ్యాపించాయి. అయితే, ఈ ఘటనలో ఎవరూ గాయడపడలేదు. లాంచింగ్ పాడ్ దెబ్బతింది.
💩 happens.#MOMO2 pic.twitter.com/dJLEOoWcXg
— NextLaunch (@Nextlaunch) June 29, 2018