జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురించి లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ పలు కీలక వ్యాఖ్యలు చేసారు. రాజకీయాల్లో ఉంటూ పవన్ సినిమాల్లో నటించడం పట్ల పలువురు విమర్శలు చేయడం మాత్రమే కాదు, జనసేన పార్టీ నాయకుడైన జేడీ లక్ష్మి నారాయణ పార్టీ కి రాజీనామా చేసిన సంగతి కూడా అందరికి తెల్సిందే.
అయితే ఈ విషయం ఫై స్పందించిన జయప్రకాశ్ నారాయణ ఇలా అన్నారు. “ప్రసిద్ధ కళాకారుడు కాబట్టి, ప్రజల్లో గొప్ప ఆదరణ ఉంది కాబట్టి, అయన హీరో గా యాక్ట్ చేస్తే కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి. అవన్నీ వదులుకొని పవన్ రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు. ఇది దీర్ఘకాలిక పోరాటం అని, ఒక్క రోజు అధికారం వచ్చేది కాదని అన్నారు. ఒక్క రోజు అధికారం కోసం పవన్ ఉబలాట పడలేదు. రాజకీయాల్లో ఉన్నవారు, మీ సొంత వ్యాపారన్నో, వృత్తినో చేపట్టడం తప్పేందుకు అవుతుంది” అని అన్నారు. పవన్ చేస్తున్న దాంట్లో తప్పేమి లేదంటూనే సొంత కుటుంబాన్ని, సొంత వారిని కాపాడుకోవటం కోసం తనకు వచ్చిన పని చేయడం, సినిమాల్లో నటించడం తప్పేమి కాదు అన్నట్లుగా తెలిపారు.