జయలలిత మృతిపై కొత్త అంశం

జయలలిత మృతిపై కొత్త అంశం

అసెంబ్లీ ఎన్నికల్లో విజయానందం దివంగత సీఎం జయలలితకు ఎంతో సేపు మిగల్చలేదనే విషయం తాజాగా వెలుగు చూసింది. ఆరోగ్యం బాగో లేకున్నా.. తాత్కాలిక ఉపశమనం పొందే మందులను తీసుకుని ఆమె ప్రమాణ స్వీకారానికి హాజరైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆర్ముగస్వామి కమిషన్‌ ముందు నలుగురు వైద్యులు వెల్లడించినట్లు సమాచారం. దివంగత సీఎం జయలలిత మరణం మిస్టరీ నిగ్గుతేల్చేందుకు రిటైర్డ్‌ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి కమిషన్‌ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే.

ఆదిలో శరవేగంగా విచారణ సాగినా, అపోలో యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో మూడేళ్లు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు విచారణ ఆగింది. ఎట్టకేలకు సుప్రీం ఆదేశాలతో సోమవారం విచారణ ముమ్మరం చేసింది. ఢిల్లీ నుంచి ఎయిమ్స్‌ వైద్య బృందం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సహకారం అందించారు.