నటి నిత్యా మీన‌న్ కోసం క్యూట్ వింటేజ్ లుక్ లోకి మారిన జ‌యం ర‌వి!

Jayam Ravi changed into a vintage look for Nithya Menon..
Jayam Ravi changed into a vintage look for Nithya Menon..

అందాల భామ నిత్యా మీనన్ తెలుగులో ఎంత పాపులారిటీ సాధించిందో, తమిళనాట కూడా అంతే ఫేమ్ తెచ్చుకుంది. ఈ బ్యూటీ అక్కడ చేసిన సినిమాలు కూడా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి, దీంతో వారు నిత్యాని ఓన్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. తాజాగా ఓ తమిళ సినిమాలో నిత్యా నటిస్తుండటంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Jayam Ravi changed into a vintage look for Nithya Menon..

తమిళ హీరో జయం రవి సరసన నిత్యా మీనన్ ‘కాదలిక్క నేరమిల్లై’ అనే రొమాంటిక్ మూవీలో నటిస్తోంది. ఈ సినిమాను కిరుతిగ ఉదయనిధి డైరెక్ట్ చేస్తుండగా, మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ గ్లింప్స్ వీడియోలో జయం రవి చాలా క్యూట్‌గా వింటేజ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇటీవలి కాలంలో జయం రవి ఈ తరహా లుక్‌లో కనిపించలేదని అభిమానులు అంటున్నారు. ఈ సినిమాను వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ సినిమాను రెడ్ జియాంట్ మూవీస్ బ్యానర్‌పై ప్రొడ్యూస్ చేస్తుండగా, యోగి బాబు, వినయ్ రాయ్, టిజె భాను, జాన్ కొక్కెన్, లాల్, తదితరులు ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.