Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఉత్తరాది రాజకీయాల్లో ఇక స్థానం లేదని అర్ధం చేసుకున్న అందాల తార జయప్రద ఇక తెలుగు పాలిటిక్స్ లోకి షిఫ్ట్ అయిపోవడానికి నిర్ణయం తీసుకుంది. తగిన పార్టీ కోసం ఎదురు చూస్తున్నట్టు ఈ మధ్య ఆమె ప్రకటన కూడా ఇచ్చారు. ఆ తగిన పార్టీ వైసీపీ కావొచ్చని తాజాగా వినిపిస్తున్న మాట. జయప్రదకు ఆప్తుడిగా పేరుపడ్డ ఓ రాజకీయ వ్యూహకర్త ఈ విషయంలో తీసుకున్న చొరవ ఫలించిందట. పార్టీ కి జయప్రద ఏమి చేయాలి ? జయప్రదకి పార్టీలో ఎలాంటి గౌరవం ఇవ్వాలి అనే అంశం మీద ఆ వ్యూహకర్త ఓ రూట్ మ్యాప్ ఇచ్చారంట. దానికి ఇటు జగన్ సైడ్ అటు జయ సైడ్ కూడా గ్రీన్ సిగ్నల్ దొరికినట్టే అంటున్నారు.
జయప్రదని పార్టీలోకి తీసుకురావడం వెనుక పెద్ద వ్యూహమే ఉందంటున్నారు వైసీపీ సన్నిహితులు. పార్టీ లో ఫైర్ బ్రాండ్ గా పేరుపడ్డ మహిళానేత రోజా దూకుడుతో లాభం కన్నా నష్టమే ఎక్కువగా జరుగుతోందని వైసీపీ కి ఎప్పుడో అర్ధం అయిపోయింది. అయితే తగిన ఆల్టర్ నేటివ్ చేసుకోకుండా ముందుకు వెళ్లడం మంచిది కాదని వైసీపీ డిసైడ్ అయ్యింది. అందుకే జయప్రద ని ముందుకు తెస్తోంది. ఆమె అధికారికంగా పార్టీలో చేరాక రోజా ఇక నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుందని వైసీపీ శ్రేణుల్లోనే వినిపిస్తున్న మాట.