Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చాలా సీనియర్. తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు చాలా మంది మిత్రులున్నారు. అంతకు మించి శత్రువులున్నారు. ముఖ్యంగా తన కోపమే తన శత్రువు అనేది ఆయనకు బాగా సరిపోతుంది. అహంకారం, పొగరు ఇవన్నీ జేసీకి ఉన్నాయనేది టీడీపీ వర్గాలు చెప్పే మాటే. అసలు ఆయన జాయిన్ అవుతాను అన్నప్పుడే అనంత క్యాడర్ తీవ్రంగా వ్యతిరేకించడానికి ఇవి కూడా ఓ కారణం.
అలాంటి జేసీ వైజాగ్ ఎయిర్ పోర్టులో చేసిన రచ్చ చంద్రబాబుకి తలనొప్పిగా మారింది. సాధారణంగా ఇలాంటి విషయాల్లో బాబు చాలా సీరియస్ గా ఉంటారు. ఎవరు తప్పు చేసినా వెంటనే అక్షింతలు పడతాయి. కానీ జేసీ ఎపిసోడ్లో అనుకున్న రేంజ్ లో స్పందించలేదని విమర్శలు వస్తున్నాయి. సారీ చెప్పించడానికి ట్రై చేయడమేంటని, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి. కానీ బాబు వ్యూహం వేరే ఉందని టీడీపీ వర్గాలంటున్నాయి.
2019 నాటికి జేసీ ఎన్ని చెడ్డ పనులు చేస్తాడో చేయనిచ్చి.. ఆ తర్వాత ఆయన కుటుంబానికి టికెట్ ఇవ్వకూడదనే మాస్టర్ ప్లాన్ వేశారని వాదన ఉంది. ఎందుకు టికెట్ ఇవ్వట్లేదని అడిగితే.. అప్పుడు గతకాలపు పాపాల చిట్టా విప్పుతారని చంద్రబాబు గురించి బాగా తెలిసిన సన్నిహితులు చెబుతున్నారు. గతంలో కూడా చాలా మంది నేతలకు ఇలాగే షాకిచ్చారని, జేసీ అందుకు మినహాయింపు కాదని వారంటున్నారు.