మహేశ్వరితో అఫైర్…వదులుకునేంత చేతకాని వాడ్ని కాను

Jd chakravarthi opens up on his affair with maheswari
త్వరలో ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తీకేయ నటించిన హిప్పీ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండగా ఈ చిత్రంలో జేడీ చక్రవర్తి కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆయన తన పర్సనల్ విషయాలను ప్రేక్షకులతో షేర్ చేసుకున్నారు. ఎక్కడ గిల్లితే హైలైట్ అవుతుందో మీడియాకి మీకు బాగా తెలుసనీ మీరు బాగా గిల్లుతారని అంటున్నానని చెప్పుకొచ్చాడు. తల్లిని మించిన దైవం లేదని నేను చెప్పినప్పుడు ఎవరూ దాన్ని హైలెట్ చేయలేదు. నా తల్లే నా గైడింగ్ ఫ్యాక్టర్ అని లక్షసార్లు చెప్పా కానీ ఆ న్యూస్ రాయరనీ ఎప్పుడో చిన్నప్పుడు ఉందో లేదో తెలియని మహేశ్వరితో ఎఫైర్‌ గురించి మాతం తెలుసుకోవడానికి ఇంట్రస్ట్ చూపిస్తారు తప్పితే నా తల్లి మూడు ఎంఏలు చదివి.. రెండు పీహెచ్‌డీలు చేసి పెద్ద ప్రొఫెసర్ అని చెప్పా అది వేయలేదు. అయితే ఈ విషయంలో మీడియాది తప్పు అని అనడం లేదని చెప్పుకొచ్చాడు. ఉందో లేదో తెలియని మహేశ్వరి గురించి పదే పదే అడుగుతున్నారని అన్నాడు. మహేశ్వరితో ఎఫైర్ వార్తల్లో వాస్తవం లేదు. అవి ఎందుకు వచ్చాయి అంటే.. మేం ఇద్దరం కలిసి నటించిన ‘గులాబి’ సినిమా జనం బాగా కనెక్ట్ అయ్యారు. తెరపై మా కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడంతో మా ఇద్దరి మధ్య ఏదో ఉందని అనుకున్నారు. మేం ఇద్దరం మంచి స్నేహితులమే తప్ప ఎఫైర్ లాంటివి ఏం లేదు. ఒకవేళ మహేశ్వరితో ఎఫైర్ ఉండిఉంటే ఆమెను వదిలేసేటంత చేతకాని వాడ్ని మాత్రం కాదని ఆయన చెప్పుకొచ్చాడు. ఆమె మంచి ఫ్రెండ్ మాత్రమే. ఆమె పర్శనల్ విషయాలను కూడా నాతో షేర్ చేసుకునేదంఅంటూ చెప్పుకొచ్చారు జేడీ చక్రవర్తి.