కార్పోరేట్ హాస్పిటల్స్ నిర్లక్ష్యం ఖరీదు ఒక పాప జీవితం

Corporate hospitals neglected cost is a baby's life

ప్రైవేట్ ఆస్పత్రి డాక్టర్ల నిర్లక్ష్యం అనాలో ఒళ్ళు బరువు అనాలో తెలియడం లేదు కానీ అది మాత్రం ఒక ఐదేళ్ల చిన్నారి పాలిట శాపంగా మారింది. వారి అశ్రద్ద వలన ఆ చిన్నారి కాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సనత్ నగర్‌కు చెందిన చంద్రశేఖర్, పావని దంపతులకు ఐదేళ్ల కుమార్తె అక్షర ఉంది. కొద్ది రోజుల క్రితం చిన్నారి ఇంట్లో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ కాలుపై కబోర్డు పడిపోయింది. తీవ్రగాయమై రక్తస్రావమవుతుండగా వెంటనే చిన్నారిని దగ్గరలోని సనత్ నగర్లో ఉన్న నీలిమ ఆస్పత్రికి తరలించారు. పాపను గమనించిన డాక్టర్లు మరుసటి రోజు సర్జరీ చేస్తామని చెప్పారు. మరుసటి రోజు డాక్టర్లు పాప తల్లిదండ్రులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ఇప్పుడు సర్జరీ చేయలేమని చిన్నారిని మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని ఉచిత సలహా ఇచ్చారు. ఏం చేయాలో తెలియని స్థితిలో పాపను చేర్చడానికి ఎన్నో ఆస్పత్రులు చుట్టూ తింపినా. పాపని ఎవరూ చేర్చుకోలేరు. చివరకు సికింద్రాబాద్లోని కిమ్స్కు తీసుకెళ్లగా పాపకు ఇన్ఫెక్షన్ సోకిందని కాలు తీసేయాలని చెప్పారు. దీంతో షాక్ తిన్న తల్లిదండ్రులు.. తప్పనిసరి పరిస్థితుల్లో కాలు తీసేయడానికి అంగీకరించారు. పాప కాలి నరం తెగిపోవడంతో రక్తప్రసరణ ఆగి ఇన్ఫెక్షన్‌ రావడంతో కాలు తొలగించాల్సి వచ్చిందట. ఒకవేళ కాలు తొలగించకపోతే చిన్నారి ప్రాణానికే ప్రమాదమని డాక్టర్లు చెప్పారట. మొదటి చేర్చిన ప్రైవేట్ ఆస్పత్రి డాక్టర్ల నిర్లక్ష్యంతోనే తమ కూతురి కాలు తీసేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాప తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆస్పత్రిపై కేసు నమోదైంది. అయితే  పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఆస్పత్రి యాజమాన్యంతో పోలీసులు చేతులు కలిపారని ఆరోపిస్తున్నారు. ఇలాంటి విషయాల్లో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తేనే మరోమారు ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి.