కెనడాలో జెర్సీ చిత్రం ప్రదర్శన

కెనడాలో జెర్సీ చిత్రం ప్రదర్శన

నాచురల్ స్టార్ నాని హీరోగా శ్ర‌ద్ధా శ్రీనాథ్ జంటగా ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో యువ నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించిన చిత్రం జెర్సీ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఇప్పుడు ఈ సినిమా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. భారత అంతర్జాతీయ టొరంటో చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు ‘జెర్సీ’ చిత్రం ఎంపికైంది. ఈ ఏడాది ఆగస్టు 9 నుంచి 15 వరకు జరిగే ఈ చిత్రోత్సవంలో జెర్సీ చిత్రం ప్రదర్శన జరగనుంది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో భాగంగా కెనడాలో ఈ కార్యక్రమం జరగనుంది.