బాలకృష్ణ తో ముచ్చటగా మూడోసారి

బాలకృష్ణ తో ముచ్చటగా మూడోసారి

దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ మంచి కసి మీద ఉన్నారు. బాలకృష్ణ తో ముచ్చటగా మూడోసారి సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఒక టీజర్ విడుదల అయిన సంగతి తెలిసిందే. అందుకు ప్రేక్షకుల నుండి భారీ స్పందన వచ్చింది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఒక అప్డేట్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం లో నటి స్నేహ ఉండనుంది అని సమాచారం. స్నేహ పాత్ర ఈ సినిమా లో చాలా పవర్ ఫుల్ గా ఉండనుంది అని సమాచారం.

ఇప్పటికే వినయ విధేయ రామ చిత్రం లో స్నేహ నటించిన సంగతి తెలిసిందే. బోయపాటి మరొకసారి బాలయ్య సినిమా లో స్నేహ ను తీసుకోవడం గమనార్హం. అయితే ఈ పాత్రకి ఉన్న వెయిట్ కారణంగా స్నేహ నే కరెక్ట్ అని భావించినట్లు సమాచారం. బాలయ్య సినిమా అనగానే హై ఓల్టేజ్ డైలాగ్స్ తో నింపేసే బోయపాటి ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.