ఎన్టీఆర్ కి జంటగా శ్రీదేవి కుమార్తె

ఎన్టీఆర్ కి జంటగా శ్రీదేవి కుమార్తె

దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించింది ఒకటి రెండు సినిమాలే. అయినా టాలీవుడ్ లో ఆమెకున్న క్రేజ్ పీక్స్ అని చెప్పాలి. టాలీవుడ్ ని ఏలి బాలీవుడ్ లో కూడా సత్తాచాటిన శ్రీదేవి కుమార్తె కావడంతో ఆమెను తెలుగులో నటింపజేయాలని చాలామంది దర్శకులు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అనేక ఆఫర్స్ ఆమె వద్దకు వెళ్లినా జాన్వీ తిరస్కరించింది. కాగా మరో భారీ ఆఫర్ ఆమె వద్దకు చేరినట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ తన 30వ చిత్రం దర్శకుడు త్రివిక్రంతో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం ఎన్టీఆర్ కి జంటగా జాన్విని తీసుకోవాలని త్రివిక్రమ్ పావులు కడుపుతున్నాడట.

ఎన్టీఆర్ మూవీ పాన్ ఇండియాగా విడుదల చేయాలని భావిస్తున్న త్రివిక్రమ్ హీరోయిన్ గా జాన్వీ అయితే మంచి అడ్వాంటేజ్ అవుతుందని ఆయన ఆలోచనట. ఎన్టీఆర్ సరసన అంటే ఆమె భారీ ఆఫర్ దక్కించుకున్నట్లే. కాకపోతే ఇప్పటికే మూడు బాలీవుడ్ సినిమాలకు సైన్ చేసిన జాన్వీ ఈ మూవీ కొరకు డేట్స్ అడ్జస్ట్ చేయగలదా లేదా అనే సందేహం ఉంది. ఒక వేళ జాన్వీ కనుక ఎన్టీఆర్ సినిమాలో చేసినట్లైతే వెండితెరపై వీరి జంట అద్భుతం చేయడం ఖాయం.