ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్స్ మృత్యు శకటం అయ్యింది.

అదృష్టం ఉన్నవాడు అంబులెన్స్ కిందే పడ్డాడు అన్న సామెత నిజమయ్యింది.అంబులెన్స్ వల్ల ఒక మనిషి ప్రాణం పోయింది..కర్నాటకలోని కోలార్‌లో చిత్తూరు వాసి మృతి చెందాడు. కోలార్ జిల్లా చెక్‌పోస్టు వద్ద వాహనాలను ఆపివేస్తున్నారని తెలియడంతో బైకు రోడ్డు పక్కకు తీసి నిలిపి ఉంచారు. అదే సమయంలో వేగంగా దూసుకొచ్చిన అంబులెన్స్ రమేష్ రెడ్డి ప్రాణాలు బలిగొన్నది. కాగ అంబులెన్స్ అదుపు తప్పి బైకులపైకి దూసుకెళ్లడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలుస్తోంది.

కాగా బెంగళూరు నుంచి కోలార్ వైపు వెళ్తున్న అంబులెన్స్ ఒక్కసారిగా రోడ్డు పక్కన నిలిపి ఉంచిన బైకులపైకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న రమేష్ కుమార్ రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఆయన భార్య నందిని రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. కళ్లెదుటే భర్త ప్రమాదంలో చనిపోవడంతో భార్య షాక్‌కు గురైంది.

అయితే లాక్‌డౌన్ లో ఉన్న ఈ సమయంలో స్వగ్రామానికి బయల్దేరి మార్గం మధ్యలో ప్రమాదానికి గురైనట్లు  తెలుస్తోంది. ఏపీకి చెందిన రమేష్ రెడ్డి బెంగళూరులోని తానిసంద్ర ప్రాంతంలో నివాసముంటూ భద్రతాధికారి(సెక్యూరిటీ అఫీషియల్)గా పని చేస్తున్నారు. కరోనా లాక్‌డౌన్ తో చిత్తూరు జిల్లాలోని తమ సొంతూరుకు భార్య నందిని రెడ్డితో కలసి బైక్‌పై అర్ధరాత్రి బయల్దేరారు. కోలార్ జిల్లా సరిహద్దు వద్ద అధికారులు నిలిపివేస్తున్నట్లు తెలియడంతో ఎవరినైనా వివరాలు అడిగి తెలుసుకొనేందుకు చెక్‌పోస్టుకు కాస్త ముందు ఆగారు. అక్కడ బైకులు నిలిపి ఉంచి మాట్లాడుతుండగా అంబులెన్స్ వేగంగా వచ్చి ఆ బైకులపై ఎక్కి బోల్తా పడింది. దాంతో  బైక్‌పై కూర్చొని ఉన్నమాట్లాడుతున్న రమేష్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా.. భార్య నందిని స్వల్ప గాయాలతో బయటపడింది. భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.