రెమ్యూనరేషన్ బాగా పెంచేసిన వెంకీ మామ

రెమ్యూనరేషన్ బాగా పెంచేసిన వెంకీ మామ

మినిమమ్ గ్యారంటీ హీరోలలో వెంకటేష్ ఒకరు. వరుస హిట్స్ తో విక్టరీ ఇంటిపేరుగా మార్చుకున్న వెంకటేష్ ఈ మధ్య యంగ్ హీరోలతో మల్టీ స్టారర్ లు,అలాగే వయసుకు దగ్గ పాత్రలు చేస్తున్నారు. 2013లో మహేష్ తో కలిసి ఆయన చేసిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తరువాత రామ్ తో మసాలా చేశారు.అలాగే హిందీ హిట్ చిత్రం ఓ మై గాడ్ తెలుగు రీమేక్ గోపాల గోపాల చిత్రంతో పవన్ తో కలిసి నటించడం జరిగింది. ఇక గత ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఎఫ్ 2సూపర్ హిట్ అందుకుంది.

ఇక ఈ సూపర్ హిట్ చిత్రానికి దర్శకుడు అనిల్ రావిపూడి సీక్వెల్ గా ఎఫ్ 3 ప్లాన్ చేస్తుండగా వెంకటేష్ ఈ పార్ట్ లో కూడా నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఐతే ఈ చిత్రం కొరకు వెంకటేష్ తన రెమ్యూనరేషన్ పెంచేశాడని టాక్. అ తన రెగ్యులర్ రెమ్యూనరేషన్ కి రెట్టింపు ఆయన డిమాండ్ చేస్తున్నారని తెలుస్తుంది. వెంకటేష్ ట్రాక్ సైతం ఇప్పుడు బాగుంది. ఆయన గత రెండు చిత్రాలు ఎఫ్ 2, వెంకీ మామ మంచి హిట్స్ అందుకున్నాయి. దీనితో ఆయన పారితోషికం పెంచారని వినికిడి.