బీహార్ సీఎం హత్యపై వీడియో.. అసలు వ్యక్తి అరెస్ట్

ప్రపంచాన్ని ఓ పక్క కరోనా అతలాకుతలం చేస్తుటే మరోపక్క జనాలు నానా యాగీ చేస్తున్నారు. అదేమంటే.. బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ను హత్య చేసిన వారికి రూ. 25లక్షల నగదు బహుమతి ఇస్తానంటూ ఈ మధ్య సోషల్‌ మీడియాలో వీడియో రిలీజ్ చేసిన ఓ వ్యక్తిని పంజాబ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

తాజాగా పోలీసులు లూథియానాలో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బిహార్‌ రోహ్‌తాస్ జిల్లాలోని తోడా గ్రామానికి చెందిన ధర్మేంద్ర కుమార్ పాండే అనే వ్యక్తి ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ను హత్యచేసిన వారికి రూ.25 లక్షల నగదు బహుమతి ఇస్తానంటూ ఓ వీడియోను షూట్ చేశాడు. ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దీంతో విషయం తెలుసుకున్న రోహ్‌తాస్‌ పరిధిలోని దినారా స్టేషన్‌ హౌస్‌ పోలీసు ఆఫీసర్‌ సియారామ్ సింగ్.. ధర్మేంద్రను అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించాడు.

అయితే.. పోస్టు చేసిన వీడియో.. మొబైల్‌ నంబర్‌ అధారంగా నిందితుడు ఉన్న లొకేషన్‌ లూథియానాగా చేధించినట్లు సియారామ్‌ స్పష్టం చేశారు. అలాగే.. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని ఆయన వివరించారు. అలాగే.. ఆ వీడియో పోస్ట్ చేసిన ధర్మేంద్ర మానసిక పరిస్థితి సరిగా లేదని తెలుసుకున్నట్లు అధికారులు వివరించారు.