జార్ఖండ్‌లోని ధన్‌బాద్ డివిజన్‌లో శనివారం తెల్లవారుజామున బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఫలితంగా డీజిల్ ఇంజన్ పట్టాలు తప్పింది. పేలుడు వల్ల రైలు ట్రాక్‌లో కొంత భాగం దెబ్బతిన్నది. ధన్‌బాద్ డివిజన్‌లోని గర్వా రోడ్ , బర్కానా సెక్షన్ మధ్య ఈ “బాంబు పేలుడు” జరిగింది అని రైల్వే శాఖ తెలిపింది.
‘‘ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం చాలా అసాధారణంగా ఉండటమే కాక దుండగులు కావాలనే రైలు పట్టాల మీద పేలుడుకు పాల్పడటంతో ధన్‌బాద్ డివిజన్‌లో డీజిల్ లోకో పట్టాలు తప్పింది” అని రైల్వేశాఖ తెలిపింది. ఈ సంఘటన వెనక నక్సల్స్ ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ పేలుడులో ఎవరు గాయపడలేదు.. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.